Cannibalism: సాధారణంగా కొన్ని జంతువులు మాత్రమే తన జాతి జంతువులను చంపి తింటుంటాయి. అయితే, పులుల వంటి జంతువులు పులి పిల్లల్ని చంపి తినడం చాలా అరుదు. అయితే మహారాష్ట్రలోని తాడోబా-అంధేరీ అభయారణ్యంలో మాత్రం ఓ పులి మాత్రం చిన్న పులి పిల్లల్ని చంపి తింటున్నట్లు తెలిసింది. రెండు పులుల నిర్వహించిన శవపరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. మరణించిన పులులను ఆరేళ్ల టీ-142, రెండేళ్ల టీ-92గా గుర్తించారు.
Read Also: Trivikram Srinivas: ఆ ముగ్గురు హీరోలపై త్రివిక్రమ్ ఫోకస్.. నెక్స్ట్ సినిమా అతనితోనా ?
రెండేళ్ల పులి పిల్ల వెనక భాగాన్ని టీ -192 అనే మగపులి తిన్నట్లుగా అటవీ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రాదేశిక పోరాటం(టెరిటోరియల్ ఫైట్)లో టీ-192 పెద్ద పులి, రెండు పులులను చంపేసినట్లు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత పిల్లల మాంసాన్ని తిన్నదని భావిస్తున్నారు. జనవరి 22న పులుల శవాలు లభించిన ప్రాంతాల్లో రెండు రోజులుగా పులుల మధ్య భీకర పోరాటాలు జరిగాయి. ఇది ‘కానిబాలిజం’గా అనుమానిస్తున్నారు. దీనిపై మరింతగా విచారించాల్సి ఉందని రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్(కోర్) నందకిషోర్ కాలే పేర్కొన్నారు.
కళేబరాలు దొరికిన ప్రాంతంలో అమర్చిన కెమెరా ట్రాప్‌లలో పులి T-192 కనిపించింది. దీంతో ఈ మరణాల్లో దీని ప్రమేయం ఉందని భావిస్తున్నారు. టి-192 టైగర్ మిగతా రెండు పులులను చంపిందా అని నిర్ధారించడానికి తదుపరి దర్యాప్తు జరుగుతోంది. క్యానిబలిజం అనేది అదే జాతికి చెందిన జంతువును ఆహారంగా తీసుకోవడాన్ని సూచిస్తుంది. పులులు ఇతర పులుల మాంసాన్ని తినడం చాలా అరుదు.
