Site icon NTV Telugu

UP: ఉసురు తీసిన ‘ఆన్‌లైన్ గేమింగ్’.. 9వ అంతస్తు నుంచి దూకి ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

Up

Up

తెలిసీ తెలియని వయసు. ఆ వయసులో ఏం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. పెద్దోళ్లు చెబితే వినే పరిస్థితి కాదు. చివరికి ముగ్గురు తోబుట్టువుల ప్రాణాలు ఒకేసారి పోయాయి. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. అసలు ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.

ఘజియాబాద్‌కు చెందిన నిషిక (16), ప్రాచి (14), పాఖి(12) ముగ్గురూ అక్కాచెల్లెళ్లు. ముగ్గురు తోబుట్టువులు కూడా ఆన్‌లైన్ గేమింగ్ అయిన ‘‘కొరియన్ లవ్ గేమ్’’కు బానిసలయ్యారు. అయితే ఏమైందో.. ఏంటో తెలియదు గానీ.. తెల్లవారుజామున 2:30 గంటల ప్రాంతంలో అపార్ట్‌మెంట్‌లోని 9వ అంతస్తు నుంచి ముగ్గురు ఒకేసారి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. భారీ శబ్దం రావడంతో నివాసితులు ఉలిక్కిపడి లేచారు. దీంతో ఒక్కసారి దిగ్భ్రాంతిక వాతావరణం ఏర్పడింది. ఇక ఆత్మహత్యకు ముందు ‘‘అమ్మా.. పాపా.. క్షమించండి.’’ అంటూ సూసైడ్ నోట్ రాసి ప్రాణాలు తీసుకున్నారు. ఒకేసారి ముగ్గురు కుమార్తెలు మరణించడంతో పేరెంట్స్, బంధువులు తల్లడిల్లిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురికి సంబంధించిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) అతుల్ కుమార్ సింగ్ తెలిపారు. ఎక్కువ సమయం ఆన్‌లైన్ గేమ్‌తోనే గడిపారని చెప్పారు. కుటుంబ సభ్యుల్ని కూడా విచారిస్తున్నట్లు వెల్లడించారు.

 

Exit mobile version