New Criminal Laws: నేటి నుంచి అమల్లోకి మూడు కొత్త క్రిమినల్ చట్టాలు..
- బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెర..
- నేటి నుంచి అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు..
- ఆన్‌లైన్‌లో పోలీస్ కంప్లైంట్స్ పాటు ఎస్‌ఎంఎస్ పద్ధతిలో సమన్లు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
New Criminal Laws: నేటి నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వస్తుండటంతో బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్‌పీసీ), భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర గత అర్ధరాత్రితో పూర్తిగా ముగిసి పోయింది.
Read Also: Tragedy: విషాదం.. మట్టి మిద్దె కూలి నలుగురు మృతి
Also Read
- E20 పెట్రోల్‌పై కేంద్రం క్లారిటీ.. ఇథనాల్ కలపడం వెనుక అసలు ఉద్దేశం ఇదే.. ఎన్ని లక్షల కోట్లు ఆదా అంటే..?
- Siddaramaiah: మంత్రుల ప్రమాణస్వీరానికి సిద్ధరామయ్య డుమ్మా! మళ్లీ విభేదాలా?
- Madhya Pradesh: ప్రచారంలో నరోత్తమ్ మిశ్రా కన్నీళ్లు.. దతియాలో కాంగ్రెస్ విజయానికి కారణం ఏంటి..?
- Prashant Kishor: బీహారీయులు సామ్రాట్ చౌదరి నాయకత్వాన్ని తిరస్కరించారు.. గెలుపు తర్వాత ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు
అయితే, కొత్త చట్టాలలో జీరో ఎఫ్‌ఐఆర్, ఫిర్యాదులను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు ఎస్‌ఎంఎస్ పద్ధతిలో సమన్లు జారీ చేసే అవకాశం ఉంటుంది. పెద్ద నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోల్లో చిత్రికరించడం వంటి కొత్త రూల్స్ న్యాయ వ్యవస్థలోకి వచ్చాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా, న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ సంప్రదాయంలో రూపొందించినట్లు తెలిపారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని అతడు వెల్లడించారు.
Read Also: NIA Raids : వివిధ కేసుల్లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ఐఏ దాడులు
కాగా, భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దేశద్రోహంగా మార్చింది. కులం, మతం లాంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష పడే ఛాన్స్ ఉండేది. కానీ, దీన్ని ఇప్పుడు యావజ్జీవ శిక్షగా మార్చారు. నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి తీసుకెళ్లింది. అలాగే, విదేశాల్లో భారతదేశానికి చెందిన ఆస్తుల ధ్వంసాన్నీ ఉగ్రవాదంగా పేర్కొనింది. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి తీసుకెళ్లింది.
Read Also: Pawan Kalyan: 3 రోజుల పాటు కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన
అలాగే, మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని మోడీ సర్కార్ జోడించింది. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా పేర్కొనింది. మైనర్‌పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించేలా నిబంధనను తీసుకొచ్చింది. పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు హామీలను లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను విడిచి పెట్టే కేసులకు కొత్త నిబంధన తీసుకొచ్చారు. మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ఉచితంగా ప్రథమ చికిత్స అందించాలి చెప్పుకొచ్చింది. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష, భారీ జరిమానా విధించేలా నిబంధనలు చేర్చారు.
Read Also: Big Explosion : టర్కీలో భారీ పేలుడు, ఐదుగురు మృతి, 63మందికి గాయాలు
ఇక, కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి నోటీసులు ఇచ్చే అంశం పూర్తిగా అన్నీ ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. పోలీసు స్టేషన్‌కు వెళ్లే పని లేకుండా ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ ద్వారా కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా సమన్లు పంపించే అవకాశం ఉంది. పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్‌లో అయినా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే జీరో ఎఫ్‌ఐఆర్ విధానం కూడా అమల్లోకి తీసుకొచ్చింది. అరెస్టైన వ్యక్తి కుటుంబానికి, స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతో పాటు వివరాలను పోలీస్ స్టేషన్లలో ప్రదర్శిస్తారించే ఛాన్స్ ఈ కొత్త చట్టాల్లో పొందుపర్చారు.
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!