NTV Telugu Site icon

Kerala Lulu Mall: 50% డిస్కౌంట్.. సునామీలా దూసుకొచ్చిన జనం

Kerala Lulu Mall

Kerala Lulu Mall

ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగేస్తారనే నానుడి ఇప్పటికీ ఉంది. రియాలిటీలో అది సాధ్యపడదు కానీ, దానికి తగినట్టు చాలా సందర్భాలే వెలుగు చూశాయి. ఏదైనా ఒక భారీ ఆఫర్ ప్రకటిస్తే చాలు.. జనాలు పోటెత్తిపోతారు. అప్పట్లో జియో సిమ్స్ అందుబాటులో వచ్చినప్పుడు, దేశవ్యాప్తంగా జనాలు ఎలా ఎగబడ్డారో చూసే ఉంటారు. అంతెందుకు.. హైదరాబాద్‌లోనే కొన్ని షాప్స్‌లో ఫలానా డిస్కౌంట్స్ ప్రకటించినప్పుడు దండయాత్రలే చేశారు.

ఇప్పుడు కేరళలోని లులు మాల్‌లో అలాంటి దృశ్యాలే కనువిందు చేశాయి. మొత్తం నగరమంతా ఆ మాల్‌లోకి వచ్చినట్టు జనాలు పోటెత్తారు. ఇందుకు కారణం.. ఆ మాల్ 50% డిస్కౌంట్ ప్రకటించడమే! చిన్నదా – పెద్దదా, చౌకైనదా – ఖరీదైనదా అని తేడాల్లేకుండా.. ప్రతీ దాని మీద 50% ఆఫర్ ప్రకటించింది. అందుకో నిర్ణీత సమయం కేటాయించింది. 6వ రాత్రి రాత్రి 11:59 గంటల నుంచి మొదలుకొని, 7వ తేదీ తెల్లవారుజాము వరకే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఆ మాల్ తెలిపింది. అంతే, ఈ ప్రకటన చూసిన జనాలు ఒక్కసారిగా మాల్‌పై ఎగబడ్డారు.

గేట్లు తీయడమే ఆలస్యం.. డ్యామ్ నుంచి నీళ్లెలా పారుతాయో అలా జనాలు లోపలికి దూసుకొచ్చారు. పాపం, అక్కడ పని చేసే స్టాఫ్ వారిని అదుపు చేయలేక నానాతంటాలు పడ్డారు. కనీసం నిలబడేందుకు చోటు కూడా లేనంతా ఆ మాల్ జనాలతో నిండిపోయింది. మెట్లపై కూడా క్యూలు కట్టేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ట్విటర్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. 50% ఆఫర్ కోసమే ఇంతలా జనాలొచ్చారా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యచకితులవుతున్నారు.

Show comments