NTV Telugu Site icon

Badlapur Encounter: ‘‘ఇది ఎన్‌కౌంటర్ కాదు’’.. బద్లాపూర్ కేసులో హైకోర్టు ఆగ్రహం..

Badlapur

Badlapur

Badlapur Encounter: బద్లాపూర్ ఎన్‌కౌంటర్ మహారాష్ట్రలో సంచలనంగా మారింది. గత నెలలో బద్లాపూర్‌లోని ఓ స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న అక్షయ్ షిండే అనే వ్యక్తి నాలుగేళ్ల వయసు ఉన్న ఇద్దరు బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలో ఆగ్రహావేశాలకు కారణమైంది. ఆందోళనకారులు బద్లాపూర్ రైల్వే స్టేషన్, రోడ్లను ముట్టడించారు. ఇదిలా ఉంటే నిందితుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం నిందితుడిని జైలు నుంచి బయటకు తీసుకువచ్చే సమయంలో ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. నిందితుడు గన్ తీసుకుని కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా తాము ఫైర్ చేశామని చెప్పారు.

ఇదిలా ఉంటే, ఈ ఎన్‌కౌంటర్‌పై అక్షయ్ షిండే తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ని ఈ రోజు బాంబే హైకోర్టు విచారించింది. మహారాష్ట్ర పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఈ ఎన్‌కౌంటర్‌ని నమ్మడం కష్టంగా ఉంది, ఇందులో ఏదో తిరకాసు ఉంది. ఒక సామాన్యుడు రివాల్వర్ లాగా పిస్టల్‌ని కాల్చలేడు. ఒక బలహీనమైన వ్యక్తి పిస్టల్‌ని లోడ్ చేయలేడు’’ అని కోర్టు సందేహం వ్యక్తం చేసింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని నిందితుడి తల్లిదండ్రులు ఆరోపించడంతో కోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా పనిగణిస్తోంది.

Read Also: DELHI: ప్రభుత్వ భూమిలో “రాణి లక్ష్మీబాయి” విగ్రహ ఏర్పాటు.. భూమి తమదన్న వక్ఫ్ బోర్డు.. చివరికీ..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా షిండేని హత్య చేశారని పిటిషనర్ పేర్కొన్నాడు. నిందితుడు బలవంతుడు కాదు, అతను ఫస్ట్ ట్రిగ్గర్ నొక్కే లోపు నలుగురు పోలీసులు అతడిని పట్టుకోలేరా..? అని ప్రశ్నించింది. పోలీసులు కథనాన్ని నమ్మడం కష్టంగా ఉందని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుత కేసులో ఎదరు దోషి అనే విషయాన్ని ఎలా పోలీసులు నిర్ణయిస్తారు. చట్టబద్ధమైన పాలన తప్పనిసరిగా ఉండాలని కోర్టు చెప్పింది. పోలీసులు ఇలాంటి చర్యల్ని ప్రోత్సహించడం ఒక చెడ్డ ఉదాహరణగా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఒక వేళ పారిపోయే పరిస్థితి ఉంటే నిందితుడి కాళ్లపై కాల్చాలని కోర్టు చెప్పింది. నిందితుడు పోలీసుల పైకి మూడు బుల్లెట్లు కాల్చాడని, మీరు ఒక్క పోలీసులకే గాయాలయ్యాయని చెబుతున్నారు..మిగతా ఇద్దరి సంతేంటి..? అని కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. వాహనంలో ఉన్న నలుగురు పోలీసులు ఒక్క వ్యక్తిని కంట్రోల్ చేయలేకపోయారంటే ఎలా నమ్మాలి..? అని పోలీసుల్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పోలీసు వాహనం డ్రైవర్‌తో సహా కాల్ డేటా రికార్డ్స్ (సిడిఆర్‌లు) సేకరించాలని కోర్టు రాష్ట్రాన్ని కోరింది. దీనిపై వచ్చే గురువారం విచారణ జరగనుంది.

Show comments