NTV Telugu Site icon

Himanta Biswa Sarma: ‘‘ సో బ్యూటీఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’’.. అస్సాం సీఎం ట్వీట్ వైరల్..

Assam

Assam

Himanta Biswa Sarma: అస్సాం సీఎం హిమంత బిశ్వ సర్మ వివాదాస్పద వ్యాఖ్యల్లోనే కాదు, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయ పోస్టులే కాకుండా కొన్ని సందర్భాల్లో ట్రెండింగ్‌కి తగ్గట్లు పోస్టులు చేస్తుంటారు. ప్రస్తుతం హిమంత చేసిన ఓ ట్వీట్ వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. కొన్ని సందర్భాల్లో ప్రాచుర్యం పొందిన డైలాగ్స్‌తో యువత రీల్స్ చేయడం చూస్తుంటాం. ఇప్పుడు ఆ రీల్స్ ట్రెండ్ హిమంతను కూడా ఆకట్టుకున్నట్లు ఉంది.

‘సో బ్యూటిఫుల్, సోలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’ అంటూ ఓ బట్టల దుకాణంలో మహిళ చేసిన సందడి అందరికి గుర్తుండే ఉంటుంది. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెడింగ్‌లో ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో జాస్మీన్ కౌర్ అనే మహిళ ఉత్సాహంగా సల్వార్ సూట్‌లను విక్రయిస్తున్న వీడియో ఈ డైలాగ్ చెప్పింది. ఇదే డైలాగ్‌ని ఉపయోగించి అస్సాం సీఎం ఓ వంతెన అందాన్ని వివరిస్తూ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అయింది.

Read Also: Pakistan: పాక్ చెర నుంచి 80 మంది జాలర్ల విడుదల.. కుటుంబాలతో దీపావళి..

అస్సాంలోని తేజ్‌ఫూర్‌లోని కోలియా భోమెరా వంతెన అద్భుతమైన ఫోటోలు, వంతెనతో పాటు హిమాలయాల అందాలను తన పోస్టులో పంచుకుంటూ..‘‘సో బ్యూటిఫుల్.. సో ఎలిగెంట్.. జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్’’ అంటూ ట్వీట్ చేశారు. తేజ్‌పూర్ లోని కొలియా భోమెరా సేతు నుంచి శీతాకాలపు ఉదయంలో కనిపించే హిమాలయాలు. తక్కువ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, కాలుష్య రహిత వాతావరణ అద్భుతమైన పర్వతం అంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ఫోటో నెటిజన్లను కూడా ఆకట్టుకుంటోంది. అద్భుతం అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

కోలియా భోమోరా సేతు 1987లో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించబడింది. ఉత్తర ఒడ్డున సోనిత్ పూర్ జిల్లాలోని తేజ్‌పూర్‌ను దక్షిణ ఒడ్డుపై ఉన్న నాగోల్ జిల్లాలోని కలియాబోర్‌తో కలుపుతుంది. ఈ వంతెనకు అస్సామీ జనరల్ కాలియా భోమోరా ఫుకాన్ పేరు పెట్టారు. మూడు కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన 7 ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. ఇది అరుణాచల్ ప్రదేశ్-టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉంది.