Thiruparankundram Deepam Controversy: కార్తీక దీపం వివాదంలో మరో ట్విస్ట్…! గవర్నర్ సీరియస్.. సీఎం విజయ్‌కు కీలక ఆదేశాలు!

Thiruparankundram Deepam Co

Thiruparankundram Deepam Co

Thiruparankundram Deepam Controversy: తమిళనాడులోని తిరుపరంకుండ్రం కార్తీక దీపం వివాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై తమిళనాడు గవర్నర్ తీవ్రంగా స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ దీపత్తూన్ వద్ద కార్తీక దీపం ఎందుకు వెలిగించలేదని ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ అంశంపై సమగ్ర వివరణ ఇవ్వాలని ఆదేశించారు గవర్నర్‌..

సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయలేదా?
నవంబర్ 20న సుప్రీంకోర్టు ఈ వ్యవహారంపై ఆదేశాలు ఇచ్చినప్పటికీ దీపత్తూన్ వద్ద కార్తీక దీపం ఎందుకు వెలిగించలేదో వివరించాలని గవర్నర్ కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఏ విధంగా అమలు చేసిందో పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. కార్తీక దీపం వెలిగింపునకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సమర్పించాలని గవర్నర్ ఆదేశించారు. ఈ విషయంలో పోలీసులకు ఇచ్చిన ఆదేశాలు, సంబంధిత అధికారుల మధ్య జరిగిన అధికారిక సమాచార మార్పిడి వివరాలను కూడా అందించాలని కోరారు.

సీఎం విజయ్ ప్రభుత్వానికి వివరణ కోరిన గవర్నర్
తిరుపరంకుండ్రం దీపం వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాల అమలుపై ప్రభుత్వం సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్ స్పష్టం చేశారు. దీపం వెలిగించకపోవడానికి గల కారణాలు, ఈ వ్యవహారంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలు సమర్పించాలని కోరారు. దీంతో సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఈ వ్యవహారం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది.