Monkeypox: దేశంలో మరో మంకీపాక్స్ కేసు.. మూడుకు చేరిన కేసుల సంఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
third monkeypox confirmed in kerala: ప్రపంచాన్ని మంకీపాక్స్ వ్యాధి వణికిస్తోంది. ఇప్పటికే 70 పైగా దేశాల్లో 14 వేలకు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇదిలా ఉంటే ఇటీవల భారత్ లో కూడా మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చింది. తాజాగా దేశంలో మూడో మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఇప్పటికే కేరళ రాష్ట్రంలో రెండు కేసులు నమోదు కాగా.. మూడో కేసు కూడా కేరళ రాష్ట్రంలోనే నమోదు అయింది. ఇటీవల యూఏఈ నుంచి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తిలో వ్యాధిని గుర్తించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. ఇటీవల సదరు వ్యక్తి యూఏఈ నుంచి మలప్పురం వచ్చాడు. ఈ నెల 13న జ్వరంతో బాధపడుతున్న వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు కనిపించాయి. దీంతో అతని నమూనాలను పరీక్షకు పంపగా మంకీపాక్స్ పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం రోగి మంజేరిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనితో సన్నిహితంగా ఉన్న వ్యక్తులను అధికారులు పరిశీలనలో ఉంచారు. ప్రస్తుతం బాధితుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.
Read Also: Business Flash: టెస్లా అనూహ్య నిర్ణయం.. బిట్ కాయిన్‌లోని మేజర్ పెట్టుబడుల అమ్మకం
Also Read
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
- Sonam wangchuk: సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ బులెటిన్ విడుదల.. చికిత్సకు నిరాకరణ..
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
కేరళఓ జూలై 14న తొలి మంకీపాక్స్ కేసు నమోదు అయింది. ఆ తరువాత దుబాయ్ నుంచి కన్నూర్‌కు వచ్చిన 31 ఏళ్ల వ్యక్తికి జులై 18న కేరళ రెండోసారి మంకీపాక్స్ ను గుర్తించారు. తాజాగా మూడో కేసు నమోదు అయింది. మంకీపాక్స్ కేసులతో కేరళ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడానికి కేంద్రం ఉన్నతస్థాయి మల్టీ డిసిప్లనరీ టీం ను కేరళకు పంపింది. రాష్ట్రంలో 14 జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. నాలుగు విమానాశ్రయాల్లో హెల్ప్ డెస్క్ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రపంచంలో యూరోపియన్ దేశాల్లో అత్యధిక మంకీపాక్స్ కేసులు నమోదు అవుతున్నాయి. ఒక్క యూరప్ దేశాల్లోనే 86 శాతం కేసులు నమోదు కాగా.. అమెరికాలో 11 శాతం కేసులు నమోదు అయ్యాయి. కామెరూన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, కాంగో, గాబన్, లైబీరియా, నైజీరియా, సియెర్రా లియోన్ వంటి పశ్చిమ, మధ్య ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా వ్యాపించే ఈ వ్యాధి ప్రస్తుతం అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా విస్తరిస్తోంది.
తాజావార్తలు
-
72nd National Film Awards: ఉత్తమ నటుడు కిరీటం వీళ్లిద్దరికీ.. జాతీయ ఉత్తమ నటిగా!
-
Abhishek Banerjee: “తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా”.. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
-
Bahadurguda Land Row : భూముల దగ్గర మళ్లీ ఉద్రిక్తత.. పోలీసులపై రాళ్లు, కుర్చీలు విసిరిన రైతులు..
-
ENG Vs IND 3rd ODI: మెన్ ఇన్ బ్లూ టార్గెట్ లార్డ్స్.. 22 ఏళ్ల నిరీక్షణకు తెరదించే సమయం వచ్చేసింది..
-
Committee Kurrollu: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’కు అరుదైన గౌరవం
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్‌కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!