NTV Telugu Site icon

Congress: థర్డ్ ఫ్రంట్ బీజేపీకి సహాయపడుతోంది.. కాంగ్రెస్ విపక్షాల ఐక్యతకు పనిచేస్తుంది..

Congress

Congress

Congress: ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ 85 ప్లీనరీ జరుగుతోంది. 2024 సాధారణ ఎన్నికల ముందు కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. వచ్చే ఎన్నికల్లో అధికారం చేపట్టేలా నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక తీర్మానాలు చేసింది. థర్డ్ ఫ్రంట్ బీజేపీకి ఎన్నికల్లో మాత్రమే సాయపడుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. వచ్చే ఎన్నికల్లో పోరాడేందుకు భావసారుప్యత కలిగిన లౌకిక పార్టీలతో, విపక్షాల ఐక్యత కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని అని వెల్లడించింది.

Read Also: Sonia Gandhi: భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగిసింది..

లౌకిక, సామ్యవాద శక్తుల ఐక్యత కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుకు ముఖ్య లక్షణం. కాంగ్రెస్ భావజాలం గల లౌకిక శక్తులను గుర్తించి ముందుకు సాగాలని, మన భావజాలంతో ఏకీభవించే లౌకిక ప్రాంతీయ శక్తులను కలుపుకోవాలని, ఉమ్మడి సైద్ధాంతిక ప్రాతిపదికన బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఎను ఎదుర్కోవడానికి ఐక్య ప్రతిపక్షం తక్షణ అవసరం అని, థర్ఢ్ ఫ్రంట్ ఆవిర్భావం బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తుందని కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానంలో పేర్కొంది.

శుక్రవారం జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగిస్తూ, లోక్ సభ ఎన్నికల్లో భావసారూప్యత కలిగిన పార్టీలతో కాంగ్రెస్ పొత్తపెట్టుకునేందుకు ఎదురుచూస్తోందని, ప్రస్తుతం ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో దేశంలో సమర్థవంతమైన, నిర్ణయాత్మ నాయకత్వాన్ని అందించగల ఏకైక పార్టీ కాంగ్రెస్ అని ఆయన స్పష్టం చేశారు.