Site icon NTV Telugu

Rahul Gandhi: ఆలోచించండి, అర్థం చేసుకోండి.. ఓటర్లను కోరిన రాహుల్ గాంధీ..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికలు మరికొన్ని రోజుల్లో ప్రారంభ కాబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటర్లకు కీలక విజ్ఞప్తి చేశారు. భారతదేశం ప్రస్తుతం కీలక దశలో ఉందని, దేశాన్ని నిర్మించే వారికి, నాశనం చేసే వారికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలని ప్రజలను కోరారు. ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ‘‘ ప్రజల భవిష్యత్తు వారి చేతిలోనే ఉంది. వారు ఆలోచించి, అర్థం చేసుకుని, ఆపై సరైన నిర్ణయం తీసుకోవాలి’’ అని సూచించారు.

Read Also: Vegetarian Thali: వెజ్ థాలీ ధరలు పెరిగాయి, నాన్-వెజ్ థాలీ ధరలు తగ్గాయి.. కారణం ఇదే..

ప్రస్తుతం దేశం ‘‘కీలమైన దశ’’లో ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్, భారత కూటమి అంటే యువతకు ఉద్యోగాలు, రైతులకు ఎంఎస్‌పీ హామీ, ప్రతీ పేద మహిళని లక్షాధికారి చేయడం, కార్మికులకు రోజుకు కనీసం రూ. 400, కులగణన, ఆర్థిక సర్వే, రాజ్యాంగం మరియు పౌరహక్కలని రక్షిస్తుందని అన్నారు. బీజేపీ అంటే నిరుద్యోగం, రైతులపై రుణభారం, రక్షణ మరియు హక్కులు లేని మహిళలు, నిస్సహాయ కార్మికులు, వివక్ష, నిరుపేదలపై దోపిడి, నియంతృత్వం, మోసపూరిత ప్రజాస్వామ్యం అని విమర్శించారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ప్రజలకు ఈ సందేశాన్ని ఇచ్చారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 7 విడుతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, ఆప్, శివసేన(యూబీటీ), డీఎంకే, ఎన్సీపీ(శరద్ పవార్), ఆర్జేడీ వంటి పార్టీలో ఇండియా కూటమి సమాయత్తం అవుతోంది.

Exit mobile version