NTV Telugu Site icon

Jewellery Robbery: దొంగల మాస్టర్ ప్లాన్.. ఏకంగా జువెలరీ షాప్‌లోకి సొరంగం.. భారీ దోపిడి..

Jewellery Robbery

Jewellery Robbery

Jewellery Robbery: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో భారీ దోపిడి జరిగింది. ఏకంగా ఓ జువెలరీ షాప్ కు కన్నం వేశారు. మాస్టర్ ప్లాన్ వేసి జువెలరీని దోచుకున్నారు. వివరాల్లోకి వెళితే మీరట్ నగరంలోని ఓ నగల దుకాణంలోకి డ్రెయినేజీ నుంచి భారీ సొరంగాన్ని తవ్వారు. 10 అడుగుల సొరంగాన్ని నేరుగా జువెలరీలోకి తవ్వి లక్షల రూపాయల విలువై ఆభరణాలను దోపిడి చేశారు. మంగళవారం ఉదయం షాప్ తెలిసిన తర్వాత యజమాని సొరంగాన్ని చూసి షాక్ తిన్నాడు. షాపులోని ఆభరణాలు అన్నీంటిని దోచుకెళ్లినట్లు గమనించాడు.

Read Alos: Atiq Ahmed: నన్ను జైలు నుంచి బయటకు రప్పించి చంపేస్తారు.. గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ సోదరుడి ఆరోపణలు

దొంగతనం గురించి జువెలరీ యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దొంగలు షాపులోకి ప్రవేశించడానికి డ్రైన్ నుంచి ఇటుకలను, మట్టిని తొలగించినట్లు పోలీసులు గుర్తించారు. లక్షల రూపాయల నగదులో దొంగలు పారిపోయారు. అయితే ఎంత మొత్తం అనేదికి ఇంకా తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.

ఈ దోపిడితో మీరట్ లోని బంగారం వ్యాపారులు నిరసన తెలిపారు. నగరంలో ఇలాంటి దోపిడి జరగడం ఇది నాలుగోసారి అని వ్యాపారులు ఆరోపించారు. వ్యాపారులు పోలీసులను దోపిడి జరిగిన దుకాణంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల నుంచి హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Show comments