NTV Telugu Site icon

BJP: రాహుల్‌గాంధీతో ధీరజ్ సాహు.. “దొంగల యాత్ర” అంటూ బీజేపీ నేత విమర్శలు..

Rahul Gandhi

Rahul Gandhi

BJP: ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఐటీ దాడులు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. బుధవారం లిక్కర్ కంపెనీలను టార్గెట్ చేసుకుని ఐటీ దాడులు ప్రారంభించింది. ఈ దాడుల్లో గుట్టలుగుట్టలుగా నగదు బయటపడుతోంది. కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో ఐటీ దాడుల్లో ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా లెక్కలో చూపని నగదు పట్టుబడింది.

అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ ఎంపీకి సంబంధించిన నివాస ప్రాంగణాల్లోనే భారీగా డబ్బు బటయపడుతుండటంతో బీజేపీ నేత, ఆ పార్టీ ఐటీ సెల్ అమిత్ మాలవీయ శనివారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. రాహుల్ గాంధీతో, ధీరజ్ సాహు ఉన్న వీడియోని ఎక్స్(ట్విట్టర్)లో షేర్ చేశారు.

Read Also: Success Story: వేలకోట్ల సామ్రాజ్యానికి వారసురాలు.. ఎవరీ ‘నిషా జగ్తియాని’?

‘‘రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిజానికి భారతదేశ దొంగలను కలిపే యాత్ర. కాంగ్రెస్ అంటే #CorruptionKiDukan. జార్ఖండ్‌లోని కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ ధీరజ్ సాహు ప్రాంగణంలో దాదాపు రూ. 300 కోట్లు రికవరీ కావడమే దీనికి సజీవ సాక్ష్యం.’’ అని హిందీలో ట్వీట్ చేశారు. ‘‘ఈ రోజు అంతర్జాతీయ అవినీతి దినోత్సం, ఈ రోజు కరప్షన్ దుకాణం యజమాని పుట్టినరోజు కూడా, ఇది కేవలం యాదృచ్చికం’’ అంటూ పరోక్షంగా డిసెంబర్ 9 సోనియాగాంధీ తన పుట్టిన రోజు గురించి ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు.

ఒడిశా, జార్ఖండ్ లోని ధీరజ్ సాహు ప్రాంగణంలో శనివారం పన్ను దాడులు కొనసాగాయి. ఇప్పటి వరకు రూ. 200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు బయటపడింది. శనివారం ఉదయం ఐటీ శాఖ రాంచీలోని ధీరజ్ సాహు ప్రాంగణంలో మరిన్ని బ్యాగుల్ని స్వాధీనం చేసుకోగా.. ఆ ప్రాంతంలో మద్యం ఫ్యాక్టరీల నిర్వహణకు బాధ్యత వహిస్తున్న బంటీ సాహు ఇంట్లో 19 బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.