Site icon NTV Telugu

Golden Temple: గోల్డెన్ టెంపుల్‌లో చోరీ.. నలుగురిపై కేసు నమోదు

Robbery In Golden Temple

Robbery In Golden Temple

Panjab: పంజాబ్‌లోని అమ’త్‌సర్‌ గోల్డెన్ టెంపుల్లో చోరీ జరిగింది. విరాళాల కౌంటర్ నుంచి లక్ష రూపాయలు మాయమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టారు. ప్రఖ్యాత దేవాలయమైన గోల్డెన్ టెంపుల్లో దొంగలు పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాలు.. నవంబర్ 27న గురునానక్ జయంతి సందర్భంగా ముందు రోజు దేవాలయంలో ఘనంగా ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు హాజరై ఆల‌యంలో నిర్వహించే అర్దాలు, లంగర్లు, కల్యాణ కార్యక్రమాల కోసం భక్తులు కానుక‌లు, డ‌బ్బులు హుండీలో వేస్తుంటారు. అయితే అందులోంచి లక్ష రూపాయలు మాయమయ్యాయి. దీంతో అక్కడ సీసీటీవి పరిశీలించగా నలుగురు వ్యక్తులు దేవాలమంలో అనుమానస్పదంగా వ్యవహరించారు.

Also Read: China: చైనా వింత నిర్ణయం.. ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న విద్యార్థుల కోసం ఆస్పత్రిలోనే ‘ హోమ్ వర్క్ జోన్స్’

కౌంటర్ వద్ద విరాళాల రిసిప్ట్ నుంచి పేపర్లు చింపినట్టు సీసీటీవీలో రికార్డు అయ్యింది. దాని అధారంగా ఆలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ నలుగురు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆలయంలో సీసీటీవీ ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్నారు. అందులో నలుగురు వ్యక్తులు అనుమానంగా టెంపుల్లోకి ప్రవేశించినట్టు కనిపించింది. విరాళాల హుండి దగ్గర ఉన్న రిసిప్ట్ బుక్ నుంచి ఓ వ్యక్తి పేపర్లు చింపేయడం రికార్టు కాగా వారే డిపాజిట్ సోమ్మును దొంగలించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో ఆ నలుగురుపై పోలీసులు కేసు నమోదు చేసి వారి పట్టుకునేపనిలో పడ్డారు. నిందితుల కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని పోలీసు అధికారి మీడియాతో పేర్కొన్నారు.

Also Read: Uttarakhand Tunnel: ఉత్తరాఖండ్ టన్నెల్ ఆపరేషన్ సక్సెస్.. 41 మంది కార్మికులు సురక్షితం..

Exit mobile version