Site icon NTV Telugu

RG Kar Convict Sanjay Roy: నేను నిర్దోషిని.. వారు నన్ను బలవంతంగా ఈ కేసులో ఇరికించారు..

Sanjay

Sanjay

RG Kar Convict Sanjay Roy: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్ ను కోర్టు దోషీగా తేల్చింది. అయితే, ఈ రోజు సీల్దా కోర్టు అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి అనిర్బన్ దాస్ మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా అని ప్రశ్నించగా.. సంజయ్ రాయ్ మాట్లాడుతూ.. వారు నన్ను బలవంతంగా పత్రాలపై సంతకం చేయించారు.. నేను నిర్దోషిని అని పేర్కొన్నాడు.

Read Also: Sri Chaitanya College: అర్ధరాత్రి విద్యార్థిని బయటికి పంపిన శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం!

అయితే, ఏ కారణం లేకుండా నన్ను ఈ కేసులో ఇరికించారు అని నిందితుడు సంజయ్ రాయ్ పేర్కొన్నాడు. నేను ఎప్పుడూ రుద్రాక్ష గొలుసు ధరిస్తానని ముందే చెప్పాను.. నేను నేరం చేసి ఉంటే, అది నేరం జరిగిన ప్రదేశంలో విరిగిపోయేది.. పోలీసులు, సీబీఐ అధికారులు నన్ను మాట్లాడనివ్వలేదు.. చాలా కాగితాలపై నన్ను బలవంతంగా సంతకం చేయించుకున్నారు.. అలాగే, వాళ్లు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కోర్టులో సంజయ్ రాయ్ చెప్పాడు.

Read Also: Sri Chaitanya College: అర్ధరాత్రి విద్యార్థిని బయటికి పంపిన శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం!

ఇక, సంజయ్ రాయ్ స్టేట్‌మెంట్‌లకు జడ్జి అనిర్బన్ దాస్ సమాధానమిస్తూ.. నాతో మాట్లాడేందుకు దాదాపు సగం రోజుల సమయం ఇచ్చాను.. మూడు గంటల పాటు నీ మాటలు విన్నాను.. నా ముందు సమర్పించిన అభియోగాలు, సాక్ష్యాలు, పత్రాలు, సాక్షులు అన్నీ పరిశీలించా.. వాటి ఆధారంగానే నిన్ను దోషిగా గుర్తించాను అని పేర్కొన్నారు. మీరు ఇప్పటికే దోషిగా నిరూపించబడ్డారని వెల్లడించారు.

Exit mobile version