NTV Telugu Site icon

Eknath Shinde: ‘నేను మాట్లాడటం ప్రారంభిస్తే భూకంపమే’.. ఉద్ధవ్‌కు ఏక్‌నాథ్ షిండే వార్నింగ్

Eknath Shinde Warning

Eknath Shinde Warning

Eknath Shinde: శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. తాను మాట్లాడటం ప్రారంభిస్తే భూకంపం వస్తుందని అన్నారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసి, ఆ తర్వాత ఎన్సీపీ, కాంగ్రెస్‌తో ఎందుకు చేతులు కలిపారని ప్రశ్నించారు. దివంగత సేన నాయకుడు ఆనంద్ డిఘేకి ఏమి జరిగిందో తనకు తెలుసని కూడా అన్నారు. 2002లో రోడ్డు ప్రమాదంలో మరణించిన శివసేన నాయకుడు, అతని గురువు ఆనంద్ డిఘే గురించి ప్రస్తావిస్తూ.. ఏం జరిగిందో కూడా తనకు తెలుసునని, తానే ప్రత్యక్ష సాక్షినని షిండే అనడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు ఆయన ప్రస్తావనను షిండే తీసుకురావడం చర్చనీయాంశమైంది.

ఉద్ధవ్ ఠాక్రే పేరెత్తకుండానే తిరుగుబాటు ఎమ్మెల్యేల‌ను ద్రోహులు అనడంపైనా షిండే పరోక్షంగా స్పందించారు.. `కేవ‌లం సీఎం కావ‌డానికి బాలా సాహెబ్ సిద్ధాంతాల‌తో మీరు రాజీ ప‌డ‌లేదా? బీజేపీతో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తారు. కాంగ్రెస్‌, ఎన్సీపీల‌తో క‌లిసి సీఎం అవుతారు. ఇది ద్రోహం కాదా?` అని ఉద్ధవ్ ఠాక్రేను నిల‌దీశారు. బాలాసాహెబ్‌ థాక్రే అసలు వారసులం తామే అని పేర్కొన్నారు. ఇటీవలే తన వర్గంలో చేరిన బాలాసాహెబ్‌ కోడలు, మనవడు కూడా తనకే మద్దతుగా నిలిచారని షిండే చెప్పారు.

Eknath Shinde: మహారాష్ట్ర గవర్నర్ వ్యాఖ్యల దుమారం.. స్పందించిన సీఎం ఏక్‌నాథ్ షిండే

వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే కలిసి పోటీ చేసి మరోసారి అధికారం చేపడతామని షిండే ధీమా వ్యక్తం చేశారు. తన నేతృత్వంలోని శివసేన, బీజేపీ కలిసి మొత్తం 288 సీట్లకు గాను 200 స్థానాలు గెలుచుకుంటాయని ఆయన పేర్కొన్నారు.

Show comments