NTV Telugu Site icon

Uddhav Thackeray: ఈ సారి ఆ తప్పు చేస్తే దేశంలో నియంతృత్వమే.. ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు..

Uddhav Thackeray

Uddhav Thackeray

Uddhav Thackeray: శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే 2024 ఎన్నికల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. జైన్ కమ్యూనిటీని ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశం నియంతృత్వం ముందు ఉందని అన్నారు. భారతదేశ స్వేచ్ఛను రక్షించే సమయం ఆసన్నమైందని అన్నారు. తూర్పు ముంబైలోని కుర్లాలో సోమవారం జరిగిన ఓ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. దేశంలో గడ్డుకాలం ఎదుర్కొంటోందని, ఈ సారి మనం తప్పు చేస్తే దేశం నియంతృత్వంలోకి వెళ్తుందని, దేశాన్ని ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. పరోక్షంగా బీజేపీ విజయం గురించి ఆయన ప్రస్తావించారు. దేశానికి స్వాతంత్య్రం కావాలని, ఒకప్పుడు స్వాతంత్య్రం కోసం పోరాడామని, ఇప్పుడు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామని, దేశంలో గందరగోళ వాతావరణం ఉందని, నియంతృత్వం మన దరిదాపుల్లో ఉందని, దాన్ని మనం ఆపాలంటూ వ్యాఖ్యానించారు.

Read Also: Iran: ఇండియాకి వస్తున్న ట్యాంకర్‌పై దాడితో మాకు సంబంధం లేదు.. అమెరికా ఆరోపణలపై ఇరాన్..

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి పొరబాట్లను చేయవద్దని ప్రజలను కోరారు. జైన మతాచార్యుల ఆశీర్వాదం కోసం తాను వచ్చినట్లు ఉద్దవ్ వెల్లడించారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇక్కడికి రాలేదని, దేశం కోసం వచ్చానని అన్నారు.

గతేడాది శివసేన పార్టీలో చీలిక వచ్చింది. ఏక్‌నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చారు. ఆయన వెంటే మెజారిటీ శివసేన ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బీజేపీ మద్దతుతో ఏక్ నాథ్ షిండే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శివసేన(ఉద్ధవ్), ఎన్సీపీ చీలిక శరద్ పవార్ వర్గం, కాంగ్రెస్‌తో వచ్చే ఎన్నికల్లో జట్టుకట్టబోతోంది.

Show comments