NTV Telugu Site icon

K.A.Paul: నోరు మూయించలేరు.. కొనుగోలు చేయలేరు

Ka Paul Dhilhi

Ka Paul Dhilhi

K.A.Paul: భారతీయ మీడియా సంస్థల్లాగా అంతర్జాతీయ మీడియాను నోరు మూయించ లేరని, వాటిని కొనుగో చేయలేరని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ అల్లర్లపై బీబీసీ డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ దాడులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే గడిచిన 9 ఏళ్లుగా బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ఠ దిగజారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీబీసీ ని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా..? అని ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛ ను కేంద్రం నియంత్రించలేదని అన్నారు. డాక్యుమెంటరీ నచ్చకపోతే కోర్టుకి వెళ్ళాలి అని సూచించారు. అంతర్జాతీయ మీడియా నోరు మూయించగలరా? అంటూ ప్రశ్నించారు. అంతర్జాతీయ మీడియాతో మోడీ యుద్ధం చేయవద్దని సూచించారు. మోడీ,అమిత్ షా,విదేశాంగ శాఖ అంతర్జాతీయ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాలని, రాజకీయాలు చేయోద్దు.. ఇది దేశానికి ప్రమాదకరం అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం లో అతిత్వరలో కవితను అరెస్ట్ చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read also: Baba Ramdev: ముస్లింలందరూ ఉగ్రవాదులే.. వివాదాస్పద వ్యాఖ్యలపై బాబా రాందేవ్ క్లారిటీ..

కేసీఆర్ దేశ్ కి నేత అయినంత మాత్రాన కవితను అరెస్ట్ చేయకుండా ఉండరని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దేశ్ కి నేత కాదని, కేసిఆర్ బీఆర్ఎస్ ఖమ్మం సభకి వచ్చిన ముఖ్యమంత్రులకు డబ్బులు ఇచ్చి తీసుకువచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రులు, నేతలు అంతా బానిసలు అని విమర్శలు గుప్పించారు. తెలంగాణ సచివాలయం ఏప్రిల్ 14న ప్రారంభిస్తామని, మరో మూడు రోజుల్లోగా ప్రకటించకపోతే ఫిబ్రవరి 17న తెలంగాణ వ్యాప్తంగా జిల్లా కలెక్టరరేట్ల ఎదుట అంబెడ్కర్ మద్దతు దారులు ఆందోళనలు చేయాలని పేర్కొన్నారు. నేను ఢిల్లీ లేదా హైదరాబాద్ లో ఆమరణ నిరాహారదీక్ష చేపడతా! అని స్పష్టం చేశారు. దళితులను కేసీఆర్ మోసం చేస్తున్నారు.. ఇచ్చిన హామీలేవి అమలుపరచలేదని ఆరోపించారు. ఏప్రిల్ 14న తెలంగాణ అంబెడ్కర్ సచివాలయం ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.
Bandi Sanjay: గిరిజన రిజర్వేషన్లపై బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు.. కేంద్రం అడ్డుకుంటే నేను చూసుకుంటా..