Site icon NTV Telugu

Turkey: అప్పుడు మాల్దీవులు, ఇప్పుడు టర్కీ.. ఇండియా దెబ్బకు విలవిల..

Turkey

Turkey

Turkey: చైనాకు మద్దతు ఇస్తూ భారత్‌కి వ్యతిరేకంగా ఉంటే ఏమవుతుందో గతంలో మాల్దీవులకు తెలిసి వచ్చింది. చివరకు భారత్ శరణుజొచ్చింది. ప్రస్తుతం టర్కీ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, టర్కీ పాకిస్తాన్‌కి మద్దతు ఇస్తూ వస్తోంది. దాడిలో చనిపోయిన బాధితులకు సంతాపాన్ని తెలపకపోగా, ఉగ్రవాదులపై భారత్ చేసిన ‘‘ఆపరేషన్ సిందూర్’’ని తప్పుపట్టింది. అమాయక పాక్ పౌరులపై భారత్ దాడి చేస్తుందనే ఆరోపణలు చేసింది. ఇదే కాకుండా, పెద్ద ఎత్తున పాకిస్తాన్‌కి డ్రోన్లను అందించింది. ఈ డ్రోన్లతోనే పాక్ భారత్‌పై దాడికి పాల్పడినట్లు తర్వాత విచారణలో తేలింది.

Read Also: Telangana Govt: రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది..

ఇదిలా ఉంటే, ఇప్పుడు భారత ప్రజలు టర్కీపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. ఎక్స్‌లో టర్కీని బాయ్‌కాట్ చేయాలని ట్రెండ్ అవుతోంది. టర్కీ యాపిల్స్‌‌ని భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. అయితే, ఇప్పుడు టర్కీ నుంచి వచ్చే యాపిల్స్‌ని పలువురు వ్యాపారులు బ్యాన్ చేస్తున్నారు. మహారాష్ట్రలో పూణేలోని యాపిల్ వ్యాపారులు టర్కీష్ యాపిల్స్ బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నాయి.

మరోవైపు, టర్కీ పర్యాటక శాఖ, భారతీయులు తమను బాయ్‌కాట్ చేయొద్దని వేడుకుంటోంది. మెజారిటీ టర్కీ ప్రజలకు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల గురించి తెలియదని, ఇండియన్ టూరిస్టులను ఆహ్వానిస్తున్నామని చెప్పింది. టర్కీ ట్రిప్‌లను క్యాన్సల్ చేసుకోవద్దని చెప్పింది. ఇవన్నీ చూస్తే టర్కీకి భారత్ దెబ్బ గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. టర్కీ ముఖ్యంగా టూరిజంపై ఆధారపడి ఉంది. ప్రతీ సంవత్సరం లక్షలాది మంది భారతీయలు ఆ దేశానికి వెళ్తుంటారు. ఇప్పుడు టర్కీ పాకిస్తాన్‌కి మద్దతు ఇవ్వడంతో భారత్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

Exit mobile version