Rahul Gandhi: నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేయడమే వారి లక్ష్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: భారత ప్రధమ ప్రధాన మంత్రి పండిట్ జవహార్ లాల్ నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేయడమే బీజేపీ వారి లక్ష్యమని కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరు మార్పుపై రాహుల్ ఘాటుగా స్పందించారు. నెహ్రూజీ తాను చేసిన పనులను బట్టే ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్ఎంఎంఎల్) పేరును ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీగా మార్చడంపై రాహుల్ గాంధీ గురువారం స్పందించారు. నెహ్రూజీ తాను చేసిన పనులతోనే ప్రజల్లో గుర్తింపు పొందారని.. కేవలం ఆయన పేరుతోనే కాదని రాహుల్ అన్నారు. ప్రధాని మోడీ నెహ్రూ వారసత్వాన్ని నాశనం చేయడం, నిరాకరించడమనే ఏకసూత్ర అజెండాతో ముందుకెళుతున్నారని మండిపడ్డారు. నెహ్రూ వారసత్వంపై ప్రభుత్వ దాడి, అణిచివేత కొనసాగినా నెహ్రూ ఘన వారసత్వం ఉనికిలో ఉంటుందని, రాబోయే తరాలకు నెహ్రూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారని స్పష్టం చేశారు.
Read also: Relationship : భర్తను ఎక్కువగా ఇష్టపడుతున్నారా..? ఒక్కసారి ఇది చూడండి..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Vande Bharat Sleeper: ఏపీ మీదుగా వందే భారత్ స్లీపర్ ట్రైన్.. ఆగే స్టేషన్లు ఇవే..
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ విషయంలో మోడీకి ఎన్నో భయాలు, అభద్రత వంటివి ఉన్నాయని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ( Jairam Ramesh) ట్వీట్ చేశారు. మ్యూజియం పేరు నుంచి ఎన్‌ను తొలగించిన ప్రధాని మోడీ పీని చేర్చారని అన్నారు. స్వాతంత్రోద్యమంలో నెహ్రూ పాత్రను మోడీ తోసిపుచ్చలేరని, దేశ ప్రజాస్వామ్య, లౌకిక విలువల పటిష్టం కోసం, శాస్త్ర సాంకేతిక పురోగమనానికి నెహ్రూ అందించిన సేవలు ఎవరూ విస్మరించలేరని జైరాం రమేష్ పేర్కొన్నారు. ప్రధాని మోడీ .. ఆయన భజనపరులు నెహ్రూ సేవలను తక్కువ చేసేందుకు చౌకబారు ప్రచారం సాగిస్తున్నారని మండిపడిన ఆయన.. అటువంటి వాటిని ప్రజలు నమ్మరని అన్నారు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..