పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత కేంద్రం వరుస సమీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక ఉగ్ర దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి (ఎల్‌ఓసీ) పాకిస్థాన్ వరుస కాల్పులకు తెగబడుతోంది. భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. తాజా పరిణామాలపై బుధవారం మరోసారి భద్రతా వ్యవహారాల కేంద్ర కేబినెట్ కమిటీ భేటీకానుంది. ఈ సమావేశంలో ప్రస్తుత పరిణామాలపై సమీక్షించి.. మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి: Kollywood : ఆమీర్ ఖాన్.. లోకేష్ కనకరాజ్.. ఓ సూపర్ హీరో
ఇప్పటికే పాకిస్థానీయుల వీసాలను కేంద్రం రద్దు చేసింది. ఇక మెడికల్ వీసాలు మంగళవారంతో ముగుస్తున్నాయి. ఇప్పటికే పాకిస్థానీయులను పంపించేశారు. అయితే కొందరు మెడికల్ ఎమర్జెన్సీ రిక్వెస్ట్ అడుగుతున్నారు. దీనిపై కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. బుధవారం నుంచి అటారీ సరిహద్దు దగ్గర రాకపోకలు బంద్ కానున్నాయి. తదుపరి పరిణామాలపై కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపివేసింది. అలాగే వీసాలు రద్దు చేసింది. అంతేకాకుండా అటారీ సరిహద్దు మూసివేసింది. అనంతరం పాకిస్థాన్ యూట్యూబ్ ఛానళ్లు నిలిపివేసింది. ఇలా ఒక్కొక్కటిగా కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది.
ఇది కూడా చదవండి: NTR 31 : ఎన్టీఆర్ – నీల్ సినిమా రిలీజ్ డేట్ మారింది.. టీజర్ డేట్ వచ్చింది
