Site icon NTV Telugu

Tiger: 36 గ్రామాల ప్రజలను భయపెట్టిన పులి.. 11 రోజులు శ్రమించి పట్టేశారు

Tiger

Tiger

మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లో నరమాంస భక్షక రాయల్ అర్బన్ టైగర్‌ ఎట్టకేలకు అటవీశాఖ అధికారులకు చిక్కింది. అయితే పులిని పట్టుకోవడం కోసం అధికారులు ఎంతో శ్రమించారు. అందుకోసం.. మూడు పులుల సంరక్షణ కేంద్రాల బృందాలు 11 రోజులుగా రెస్క్యూ పనిలో నిమగ్నమయ్యాయి. అంతేకాకుండా.. పులిని పట్టుకునేందుకు 5 ఏనుగులతో పాటు 150 మంది సైనికులు రంగంలోకి దిగారు. ఈ పులి ఒక వ్యక్తిని చంపడంతో 36 గ్రామాల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మొత్తానికి.. రైసెన్‌లో రాయల్ అర్బన్ టైగర్‌ను అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.

Supreme Court: కోటా ఆత్మహత్యలకు సంబంధం లేదు.. నీట్ పిటిషన్లపై చురకలు

గత నాలుగు నెలలుగా.. పులి సంచారంతో రైసెన్ జిల్లా ప్రధాన కార్యాలయంతో పాటు చుట్టుపక్కల 36 గ్రామాల్లో భయాందోళనలతో గడుపుతున్నారు. గత 10 రోజులుగా.. రతపాని టైగర్ రిజర్వ్ ఆఫ్ రైసెన్, కన్హా టైగర్ రిజర్వ్, సత్పురా టైగర్ రిజర్వ్‌లలో 150 మంది సైనికుల బృందం 5 ఏనుగుల బృందంతో పాటు పులి కోసం కాపు కాస్తున్నారు. పులిని పట్టుకునేందుకు సైనికులు ఎండ వేడిమిలో అడవిలో తీవ్రంగా శ్రమించారు. దీంతో.. పులిని గురువారం మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో అటవీ శాఖ అధికారులు పట్టుకున్నారు.

Air Taxi: ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్ టాక్సీ ప్రారంభం.. ఎక్కడంటే..

గురువారం రైసెన్ నగరానికి సమీపంలోని సురాయ్ అడవుల్లో పులి సంచారాన్ని గుర్తించారు. దీంతో బృందాలు అక్కడికి చేరుకుని పులిని చుట్టుముట్టి రెండు ఇంజక్షన్లతో అపస్మారక స్థితికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా.. నెల క్రితం నీమ్‌ఖేడా నివాసి మణిరామ్ జాతవ్ అనే వ్యక్తిని పులి చంపి తింది. దాదాపు 6 నెలలుగా నగరం చుట్టుపక్కల ఉన్న అడవిలోనే పులి సంచరిస్తుంది. అయితే.. పులిని పట్టుకున్నారనే వార్త తెలియగానే జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పులిని పట్టుకున్న తర్వాత కూడా జాగ్రత్తతో అడవుల్లోకి వెళ్లాలని DFO విజయ్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే రైసెన్ జిల్లాలో ఇప్పటికీ 70 కంటే ఎక్కువ పులులు రతపాని, రైసెన్ చుట్టుపక్కల అడవులలో ఉన్నట్లు తెలిపారు. కాగా.. ఇప్పుడు పట్టుకున్న పులిని సత్పురా టైగర్ రిజర్వ్‌లో వదిలివేయనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

Exit mobile version