NTV Telugu Site icon

Karnataka Elections: బీజేపీ మాస్టర్ ప్లాన్.. డీకే శివకుమార్, సిద్ధరామయ్యలకు చెక్ పెట్టేలా స్కెచ్..

Bjp

Bjp

Karnataka Elections: కర్ణాటక రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ పావులు కదుపుతోంది. కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేవిధంగా ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిన్న 189 మంది అభ్యర్థులతో తొలివిడత జాబితాను విడుదల చేసింది. దీంతో 52 మంది కొత్తవారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఆయా నియోజకవర్గాల్లో సామాజిక సమీకరణలు, బలమైన అభ్యర్థులను చూసి పోటీలో నిలిపినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉన్న కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బీజేపీ ఎవరిని పోటీలో నిలబెడుతుందా..? అనేది సర్వత్రా ఆసక్తిని పెంచింది. అయితే వీరిద్దరిపై బీజేపీలో బలమైన నేతలుగా ఉన్న ఆర్ అశోక్, వీ సోమన్నలను నిలబెడుతోంది. వీరిద్దరు దక్షిణ కర్ణాటక ప్రాంతంలోని కనక్ పురా, వరుణ నుంచి పోటీలో నిలబడుతూనే, వారి సొంత నియోజకవర్గాల్లో కూడా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కీలక నేతలు పోటీ చేస్తున్న ఈ రెండు నియోజకవర్గాల్లో బీజేపీ బలహీనంగా ఉంది. అయితే వీరి పోటీతో దక్షిణ కర్ణాటక ప్రాంతంలో బీజేపీ శ్రేణులు బలపడగాయని, పార్టీ పనితీరు మెరుగుపడుతుందని బీజేపీ భావిస్తోంది.

Read Also: Wealth of CMs: 30 మంది సీఎంలలో 29 మంది కోటీశ్వరులే.. టాప్‌లో జగన్ మోహన్ రెడ్డి

వొక్కలిగ వర్గానికి చెందిన కీలక నాయకుడిగా అశోక్ ఉండగా, లింగాయత్ వర్గానికి చెందిన సోమన్న, ఇద్దరూ తమ కమ్యూనిటీలో బలమైన నేతలుగా ఉన్నారు. ఈ రెండు స్థానాలను గెలుచుకునేందుకు బీజేపీ తన వనరులన్నింటిని ఉపయోగించాలని అనుకుంటోంది. ఇద్దరు అభ్యర్థులు బాగా పనిచేస్తే వారి కుటుంబాలకు సీట్లు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే వీరిద్దరిని డీకే శివకుమార్-కనక్ పురా, సిద్ధరామయ్య-వరుణ స్థానాల నుంచి పోటీలో నిలబెడితే వీరిని ఆ నియోజకవర్గాలకు మాత్రమే కట్టడి చేయొచ్చని, కర్ణాటక మొత్తం ప్రచారం చేసే అవకాశం లేకుండా చేయాలని బీజేపీ భావిస్తోంది.

ఇక బీజేపీ కీలక నేత మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పను కూడా బీజేపీ బాగా ఉపయోగించుకుంటోంది. అభ్యర్థుల ఎంపికలో ఆయన ముద్ర కనిపిస్తోంది. బీజేపీ ఫస్ట్ లిస్టులో 50 మంది యడియూరప్ప లింగాయత్ కమ్యూనిటీకి చెందినవారు ఉన్నారు. మరో 40 మంది వొక్కలిగ వర్గానికి చెందిన వారు ఉన్నారు. ఇక యడియూరప్ప స్థానం అయిన షికారిపుర నుంచి ఆయన కొడుకు బీవై విజయేంద్రకు పోటీలో నిలబ్డడారు.