Air India Express: విమానాన్ని వెనక్కి రప్పించిన ఉల్లి ఘాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India Express: ఉల్లి ఘాటు విమానాన్ని వెనక్కి రప్పించింది. సాధారణంగా సాంకేతిక సమస్యలు, అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు విమానాలు దారి మళ్లించడం లేదా దగ్గర్లోని ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం విమానంలో వచ్చిన ‘ఘాటు వాసన’.. అత్యవసరంగా వెనక్కి మళ్లించడానికి కారణమైంది. అందుకు ఓ బాక్సులో ఉన్న ఉల్లి,కూరగాయలు కారణం కావడం గమనార్హం. ఈ ఘటన కొచ్చి నుంచి షార్జాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానంలో చోటుచేసుకుంది. కొచ్చి నుంచి షార్జాకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ (IX 411) విమానం.. 175 మంది ప్రయాణికులతో ఆగస్టు 2 రాత్రి బయలుదేరింది. పైకి ఎగిరిన కొద్ది సేపటికే ఏదో ఘాటు/మండుతున్న వాసన వస్తోందని ఓ ప్రయాణికుడు సిబ్బందికి ఫిర్యాదు చేశాడు. తోటి ప్రయాణికులు కూడా అదే ఫిర్యాదుచేశారు.దీంతో విమానంలో గందరగోళం నెలకొంది. వెంటనే అప్రమత్తమైన పైలట్.. ముందు జాగ్రత్తగా విమానాన్ని వెనక్కి మళ్లిస్తున్నట్లు ప్రకటించారు. ఆ నిర్ణయంతో ప్రయాణికుల్లో మరింత ఆందోళన, ఉత్కంఠ పెరిగాయి. కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో (CIAL) సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులందరూ ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే ఇంజినీరింగ్ బృందాలు వచ్చి విమానం మొత్తం పరిశీలించాయి. పొగ లేదా ఏదైనా సాంకేతిక సమస్య ఉందని చెప్పడానికి ఏవిధమైన ఆధారాలు లభించలేదు. చివరకు విమానంలోని సరకు రవాణా విభాగంలోని ఉల్లి లేదా కూరగాయల బాక్సు ఆ ఘాటు వాసనకు కారణంగా ప్రాథమికంగా నిర్ధారించారు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
ఈ ఘటనకు సంబంధించి అదే విమానంలో షార్జా వెళ్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మాథ్యూ కులల్‌నాదన్ మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో విమానంలో గందరగోళం నెలకొంది. చివరకు విమానం సురక్షితంగా ల్యాండ్ అవడంతో ఊపిరి పీల్చుకున్నామని వివరించారు. దీనిపై సదరు విమానయాన సంస్థ కూడా స్పందిస్తూ.. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొంది. ‘కార్గో’లో పెట్టిన ఉల్లి, కూరగాయల నుంచే ఆ ఘాటు వాసన వచ్చి ఉండవచ్చని ఎయిర్‌లైన్స్ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా గల్ఫ్ దేశాలకు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాల్లో కూరగాయలు, పండ్లు, పూలను కూడా భారీ స్థాయిలో తరలిస్తుంటారు.
- Tags
- Air India Express
- Back
- Onion
- plane
- Smell
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!