NTV Telugu Site icon

New Delhi : జమిలి ఎన్నికలపై లా కమిషన్ నేడు కీలక సమావేశం

Untitled 12

Untitled 12

politics: లోక్‌సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై లా కమిషన్ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. జమిలి ఎన్నికలతో దేశ ప్రయోజనాలతో పాటు ప్రభుత్వ ఖజానా కూడా భారీగా ఆదా చేయవచ్చని లా కమిషన్ భావిస్తుంది. అలాగే తరచుగా ఎన్నికల కారణంగా ఓటర్లలో నిరాసక్తత ఏర్పడుతుందని, ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్ శాతం కూడా మెరుగుపడుతుందని భావిస్తుంది లా కమిషన్. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న సమావేశంలో వన్ నేషన్ – వన్ ఎలక్షన్స్‌పై లా కమిషన్ తన వైఖరి ఖరారు చేయనుంది.

Read also:PCOD-PCOS: పీసీఓడీ-పీసీఓఎస్ తేడా ఇదేనా? ఇలా చేయండి

కాగా లా కమిషన్ పోక్సో చట్టం కింద పిల్లల కనీస వయస్సును సైతం నిర్ధారించనుంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ లైంగిక నేరాల విషయంలో మైనర్లుగా నిర్థారించే వయస్సును 18 నుంచి 16కు తగ్గించాలన్న ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనుంది. లా కమిషన్ ఆన్‌లైన్ ద్వారా ఎఫ్.ఐ.ఆర్ నమోదు అంశాన్ని సైతం పరిగణలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ ఈ అన్ని అంశాలపై లోతుగా అలోచించి, సుదీర్ఘంగా చర్చించి తన సిఫార్సులతో కూడిన 22వ నివేదికను కేంద్రానికి అందించనుంది.