The Kerala Story: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ ది కేరళ ఫైల్స్ ’ సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. విడుదలతో పాటే వివాదాలను కూడా తీసుకువచ్చింది. ముఖ్యంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సినిమాపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు మాత్రం ఈ సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పించాయి. ఇదిలా ఉంటే శాంతిభద్రతల పరిస్థితి దృష్ట్యా తమిళనాడులోని మల్టీప్లెక్స్ థియేటర్లలో ఆదివారం నుంచి ఈ సినిమాను నిలిపివేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
Read Also: Himanta Biswa Sarma: రాహుల్ గాంధీకే గ్యారెంటీ లేదు.. ప్రజలకు ఏం గ్యారెంటీ ఇస్తారు..?
‘ది కేరళ స్టోరీ’ విడుదలకు వ్యతిరేకంగా తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి (ఎన్‌టికె) శనివారం చెన్నైలో నిరసనకు దిగింది. ఈ చిత్రానికి వ్యతిరేకంగా చెన్నైలోని స్కైవాక్ మాల్ సమీపంలోని చెన్నై అన్నానగర్ ఆర్చ్‌లో నామ్ తమిళర్ పార్టీ నిర్వాహకుడు, నటుడు మరియు దర్శకుడు సీమాన్ నేతృత్వంలోని కార్యకర్తలు నిరసనలకు దిగారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ
సినిమాను చూడవద్దని ప్రజల్ని కోరారు. కేరళ స్టోరీ సినిమా ముస్లిం సమాజానికి వ్యతిరేకంగా ఉందని, పుదుచ్చేరి, తమిళనాడు ప్రభుత్వాలు ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ గతంలో సీమాన్ డిమాండ్ చేశారు.
‘ది కేరళ స్టోరి’ ట్రైలర్ విడులైనప్పటి నుంచి వివాదం చెలరేగింది. కేరళ రాష్ట్రంలో 32,000 హిందూ, క్రిస్టియన్ యువతులు అదృశ్యమయ్యారని, ఆ తరువాత ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరాననే వృత్తాంతంతో ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు సుదీప్తో సేన్. తెలుగు, తమిళం, మళయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమాపై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శించారు. ఇది ‘సంఘ్ పరివార్’ అబద్దపు ప్రచారమని ఆరోపించారు.