NTV Telugu Site icon

Threatened for Money: ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ను డబ్బులకోసం బెదిరించిన ఇన్ స్పెక్టర్.. తరువాత ఏమైదంటే..!?

Untitled 3

Untitled 3

Karnataka: కష్టపడకుండా డబ్బులు సంపాదించాలి అనుకుంటే అది మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే కష్ట పడకుండా ఏది రాదు. అలా కష్ట పడకుండా సంపాదించాలి అని అడ్డదారులు తొక్కితే ఆపైన ఎదురైయ్యే అనర్ధాలను ఊహించడం కూడా చాల కష్టం. అయిన కొందరు వ్యక్తులు మాత్రం దొరికితేనే కదా దొంగ అనుకుంటూ నేరాలకు పాలపడుతున్నారు. ఏ నేరం చేసిన పోలీసులు అరెస్ట్ చేస్తారు. అదే పోలీసు పేరు చెప్పి దందా చేసిన, దోపిడీ చేసిన ఎవరు అడగరు అనుకుని పోలీసు అవతారం ఎత్తుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలో కోకొల్లలు. తాజాగా ఆలాంటి ఘటనే కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.

Read also:Purandeswari: సీఎం జగన్ రైతులకు ఇచ్చిన హామీలు నేరవేర్చకుండా మోసం చేశారు..

వివారాలలోకి వెళ్తే.. కె.బి.రామదాసప్ప అనే వ్యక్తి షీరా డివిజన్‌కు చెందిన భద్రా అప్పర్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా అతనికి ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసిన తాను లోకాయుక్త ఇన్ స్పెక్టర్ ని అని పరిచయం చేసుకుని డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరించారు. ఇలా రెండు మూడు సార్లు కాల్ చేసాడు. దీనితో అనుమానం వచ్చిన కె.బి.రామదాసప్ప విధానసౌధ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తనకు వస్తున్న ఫోన్ కాల్స్ గురించి ఫిర్యాదు చేశారు. తన నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో అజ్ఞాత వ్యక్తులు ఈ తరహా కాల్స్‌ చేస్తున్నారని.. దీనితో తనకి చాల ఇబ్బందిగా ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఇట్టకేలకు తాజాగా నిందితుడిని పట్టుకుని అరెస్ట్ చేసారు.