Indian Coast Guard sent back the Pakistani warship: ఇండియన్ కోస్ట్ గార్డ్స్ పాకిస్తాన్ కు చెందిన యుద్ధ నౌకను తరిమిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ పోర్ బందర్ తీరంలోని అరేబియా సముద్ర జలాల్లో జూలై నెలలో ఈ ఘటన జరిగింది. పాక్ యుద్ధ నౌక ఆలంగీర్ భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దుగా ఉన్న సముద్ర జలాలను దాటి భారత్ జలాల్లోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని ఇండియన్ కోస్ట్ గార్డ్స్ గుర్తించింది. కోస్ట్ గార్డ్స్ కు చెందిన డోర్నియర్ విమానం మొదటగా ఈ యుద్ధ నౌక భారత జలాల్లోకి రావడాన్ని గుర్తించింది. వెంటనే విషయాన్ని కమాండ్ సెంటర్ కు అందించింది.
డోర్నియర్ విమానం, పాక్ యుద్ధ నౌకకు పలు మార్లు హెచ్చరికలు చేసింది. మీ జలాల్లోకి తిరిగి వెళ్లాలని కోరింది. అయితే ఎంతకూ యుద్దనౌక స్పందించలేదు. దీంతో నౌకకు ఎదురుగా విమానం ఎగురుతూ.. నిఘా పెట్టింది. మరోసారి రేడియో కమ్యూనికేషన్ ద్వారా నౌక కెప్టెన్ ను సంప్రదించేందుకు ప్రయత్నించినా.. వాళ్లు స్పందించలేదు. డోర్నియర్ విమానం నౌకపై పలుమార్లు ఎగరడాన్ని గుర్తించిన యుద్ధ విమానం ఆ తరువాత వెనక్కి తగ్గింది. యుద్ధ నౌక తిరిగి పాక్ జలాల్లోకి వెళ్లేలా చేసింది. అయితే భారత జలాల్లోకి ఎంతదూరం వెళ్తామనే ఉద్దేశ్యంతోనే ఈ నౌక భారత జలాల్లోకి ప్రవేశించిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: Keerthy Suresh: పెళ్లి పీటలెక్కనున్న మహానటి.. వరుడు ఎవరంటే?
ఇటీవల కాలంలో గుజరాత్ తీరంలో పాకిస్తాన్ నార్కో టెర్రరిజాన్ని ప్రారంభించింది. మాదక ద్రవ్యాలను గుట్టు చప్పుడు కాకుండా ఇండియాలోకి తీసుకువస్తోంది. సర్ క్రిక్ ప్రాంతంలో ఈ చర్యలను నివారించేందుకు ఇండియన్ కోస్ట్ గార్డ్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గుజరాత్ తీరం వెంబడి నిఘాను ఎక్కువ చేశాయి. ద్వారక సమీపంలో ఉండే జనావాసాలు లేని ఏరియాలను కూడా తనిఖీ చేస్తోంది కోస్ట్ గార్డ్స్. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉండటంతో ఆపరేషన్ ఐలాండ్ వాచ్ ని నిర్వహిస్తోంది.