The Health Benefits Of Sugarcane Juice: మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పానీయాల్లో చెరుకురసం ఒకటి. దీని వల్ల మన మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నిజానికి.. చెరకు రసం తాగితే షుగర్ వ్యాధి వస్తుందేమోనని చాలామంది భ్రమపడుతుంటారు. ఇంకా ఇతర సమస్యలు కూడా రావొచ్చని అపోహలు ఉంటాయి. ఒకవేళ మీకూ అలాంటి అపోహలు ఉంటే, వెంటనే వాటిని మెదడు నుంచి తొలగించేయండి. ఎందుకంటే.. ఈ చెరుకురసం వల్ల ప్రయోజనాలే తప్ప నష్టాలేమీ ఉండవు.
Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు రాజకీయంగా అంగవైకల్యంతో బాధపడుతున్నారు
ఈ చెరుకు రసం శరీరంలో తేమను కాపాడడంలో సహాయపడుతుంది. శరీరానికి కావాల్సిన ఎలక్ట్రోలైట్స్‌ను అందిస్తుంది. వేసవిలో అధిక వేడి కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు లోనైనప్పుడు.. ఈ చెరుకురసం తాగితే ఎంతో మంచిది. ఇది తక్షణమే శక్తినిస్తుంది. నీరసంతో బాధపడుతున్న వారు ఈ చెరుకు రసం తాగితే.. చురుగ్గా తయారవుతారు. ఈ విషయాన్ని స్వయంగా ఆరోగ్య నిపుణులే సూచిస్తున్నారు. క్రీడాకారులు సైతం ఎక్కువగా ఈ చెరుకురసంని ప్రిఫర్ చేస్తారు. చెరకు రసంలో విటమన్ ఏ, సీ, బీ తోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ శరీరంలో ఎన్నో ముఖ్య కార్యకలాపాలకు అవసరం అవుతాయి.
జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు.. ఈ చెరుకు రసం తాగితే, ఇది సహజ విరేచనకారిగా పనిచేస్తుంది. కాలేయాన్ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే. వ్యర్థాలను బయటకు పంపిస్తుంది. ఫలితంగా.. కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. ఈ రసంలోని ఇందులోని గ్లైకోలిక్ యాసిడ్ చర్మానికి చాలా మంచిది. తేజస్సును కాపాడడంలో తోడ్పడుతుంది. విటమిన్ సీతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఈ చెరుకురసంలో ఉండటం వల్ల.. వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. ఈ చెరుకు రసం బరువుని నియంత్రించడంలోనూ సహకరిస్తుంది. అయితే.. మంచి ప్రయోజనాలు కలుగుతాయి కదా అని ఎక్కువగా తాగేయకూడదు. మితంగా తీసుకోవాలి.