NTV Telugu Site icon

ఎంతటి విషాదం.. కొద్దిసేపట్లో పెళ్లి.. ఇంతలోనే వరుడు అలా

bihar

bihar

అక్కడ పెళ్లి వేడుక జరుగుతుంది.. బంధువులు, స్నేహితులు పెళ్ళిలో అటుఇటు తిరుగుతూ హడావిడి చేస్తున్నారు.. వధువు.. తన కొత్త జీవితం గురించి కళలు కంటూ వరుడు కోసం ఎదురుచూస్తుంది. అంతలోనే బ్యాండ్ బాజా భారత్ తో వరుడు కారులో వచ్చేశాడు. అతను రావడం .. వధువుకు తాళికట్టడంతో పెళ్లి ముగిసేది.. కానీ, విధి వారి జీవితాన్ని మరోలా రాసింది. కారు నుంచి దిగిన వరుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పెళ్లి హడావిడి వలన కుప్పకూలాడేమో అనుకోని హాస్పిటల్ కి తీసుకెళ్లగా డాక్టర్ చెప్పింది విని పెళ్లి వారు శోకసంద్రంలో మునిగిపోయారు.

పశ్చిమ చంపారన్‌ జిల్లాలోని బెట్టియా పరిధిలోని చరద్వాలి గ్రామానికి చెందిన మనీష్‌ గిరికి, యోగాపట్టిలోని అమేథియా గ్రామానికి చెందిన చందా అనే యువతికి పెళ్లి నిశ్చయమైంది. వారి పెళ్ళికి కుటుంబ సభ్యులు గ్రాండ్ గా ఏర్పాట్లు చేశారు. సంగీత్, హల్దీ వేడుకల అనంతరం పెళ్లి రోజు రానే వచ్చింది. అందరు ముస్తాబై పెళ్లి కొడుకు కోసం ఎదురుచూస్తున్నారు.. కారులో పెళ్లి కొడుకు రావడంతో అందరి కళ్ళు వరుడిపై పడ్డాయి. మనీష్ కారు దిగగానే కుప్పకూలిపోయాడు. ఈ అనుకోని సంఘటనకు అక్కడున్నవారందరు షాక్ అయ్యారు. వెంటనే అతనిని హాస్పిటల్ కి తీసుకెళ్లారు. హార్ట్ అటాక్ తో మనీష్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. వరుడు మృతితో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న వధువు స్పృహ కోల్పోయింది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది.