Site icon NTV Telugu

Pakistan: భారత్‌ని మరిచిపోండి, పాకిస్తాన్ ఈ రెండు రాష్ట్రాల GDPని కూడా దాటలేదు..

Gdp

Gdp

Pakistan: తాను అడుక్కుతిన్నా మంచిదే కానీ, భారత్ ఎదగకూడదు, ఏదో విధంగా ఇండియాను చిరాకు పెట్టాలనేదే దాయాది దేశం పాకిస్తాన్ ఉద్దేశ్యం. భారత్‌తో నేరుగా తలపడే బలం లేక వెనక నుంచి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. పాక్ ప్రజలు ఆకలి కేకలు, నిత్యావసరాల కోసం బాధ పడుతుంటే, పాక్ మాత్రం ఉగ్రవాదం కోసం, తన సైన్యం కోసం వేల కోట్లు ఖర్చు పెడుతోంది. చివరకు, తన ప్రజలకు భారత్ తమ కన్నా వెనకపడి ఉందనే విష ప్రచారం చేస్తోంది. చివరకు, ఇటీవల ఆపరేషన్ సిందూర్ తర్వాత తన 11 ఎయిర్ బేస్‌లు ధ్వంసమైనా కూడా భారత్‌పై తామే గెలిచామంటూ సంబరాలు చేసుకోవడం ఒక్క పాకిస్తాన్‌కే చెందింది.

Read Also: Nagachaitanya : ఏడాది ముందే మీడియాకి సెట్ చూపించిన నాగ చైతన్య సినిమా టీం

భారత్‌ని మించిపోవడం అనేది పాకిస్తాన్ కలలో కూడా సాధ్యపడని అంశం. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్, అరబ్ దేశాలు, చైనా నుంచి అడుక్కోవడం అలవాటుగా మారింది. చివరకు ఐఎంఎఫ్ ఇటీవల 1బిలియన్ డాలర్లను రుణంగా మంజూరు చేసింది. అయితే, భారత ఆర్థిక వ్యవస్థకు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉంది. చివరకు, పాకిస్తాన్ GDP, మనదేశంలోని మహారాష్ట్ర, తమిళనాడు GDPను కూడా క్రాస్ చేయలేదు.

2004-05లో, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దాదాపు USD 132 బిలియన్లు. ప్రస్తుతం ఇది USD 338 బిలియన్ల నుండి USD 373.08 బిలియన్ల వరకు ఉంది. మహరాష్ట్ర ఆర్థిక వ్యవస్థ 2004-05లో 92 బిలియన్ డాలర్ల నుండి 2023-24లో 490 బిలియన్ డాలర్లకు పెరిగింది. తమిళనాడు ఆర్థిక వ్యవస్థ ఇదే కాలంలో 48 బిలియన్ డాలర్ల నుంచి 329 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఇటీవల అంచనాల ప్రకారం, మహారాష్ట్ర స్థూల రాష్ట్రీయ ఉత్పత్తి(జీఎస్‌డీపీ) రూ. 42.67 లక్షల కోట్లుగా ఉంది. ఇది 490 బిలియన్ డాలర్లకు సమానం. ఇక తమిళనాడు జీఎస్‌డీపీ రూ. 31.55 లక్షల కోట్లు అంటే, 329 బిలియన్ డాలర్లు. ఒక్క మహారాష్ట్ర జీడీపీనే పాకిస్తాన్ మొత్తం ఆర్థిక వ్యవస్థ కన్నా 45 శాతం పెద్దది. దాదాపుగా తమిళనాడు రాష్ట్ర జీడీపీకి సమానం.

Exit mobile version