NTV Telugu Site icon

Ram Setu: రామసేతు వంతెన నిజమే.. ఫోటోలు విడుదల చేసిన ఇస్రో..!

Rama Setu

Rama Setu

Ram Setu: భారత్- శ్రీలంకల మధ్య రామసేతు వంతెన కాల్పనికం కాదు.. నిజమే అని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (isro) వెల్లడించింది. అమెరికాకు చెందిన ఉపగ్రహం ఐస్‌శాట్‌-2 డేటాను వినియోగించి తమిళనాడులోని ఈ వంతెనకు సంబంధించిన మ్యాప్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు రిలీజ్ చేశారు. భారత్, శ్రీలంక మధ్య ఉండే ఈ వంతెన పొడవు 29 కిలో మీటర్ల మేర ఉంటుందని అంచనా వేశారు. దీని ఎత్తు సముద్రగర్భం నుంచి 8 మీటర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ వంతెన తమిళనాడులోని రామేశ్వరం ద్వీపం ఆగ్నేయ దిక్కులోని ధనుష్కోడి నుంచి శ్రీలంకలోని మన్నారు ద్వీపంలోని తలైమన్నార్‌ వాయవ్య దిశ వరకు విస్తరించి ఉంది అని నిర్ధారించారు. దీనిని సున్నపురాతితో నిర్మించినట్లు ఇస్రో శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఈ రామ సేతువు 99. 98 శాతం నీటిలో మునిగిందని సైంటిస్టులు చెప్పుకొచ్చారు.

Read Also: Pakistan : పాకిస్థాన్ లో మరో జర్నలిస్ట్ దారుణ హత్య.. దుండగులు బైక్ పై వచ్చి..

అయితే, అక్టోబర్ 2018 నుంచి 2023 అక్టోబర్ మధ్య ఆరు సంవత్సరాల డేటాను ఇస్రో రెడీ చేశారు. ఇస్రోకు చెందిన జోధ్‌పూర్, హైదరాబాద్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌ల శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధన చేశారు. రామాయణ కాలంలో లంకాధిపతి రావణుడు సీతమ్మను అపహరించి.. ఆమెను అక్కడే దాచాడు.. హనుమంతుడు లంకాయాణం చేసి సీతమ్మ జాడను కనుగొని.. ఆ తర్వాత లంకకు చేరుకునేందుకు సముద్రంపై వానరసేన సహాయంతో వంతెనను నిర్మించినట్లు నానుడి. ఆ రామ సేతుపై నుంచే వానరసేన లంకకు చేరుకుంది. అయితే, క్రీస్తుశకం 9వ శతాబ్దం వరకు పర్షియన్లు ఈ వంతెనను ‘సేతు బంధైగా పిలిచేవారు.. రామేశ్వరం ఆలయ రికార్డుల ప్రకారం.. ఈ వంతెన 1480 వరకు తుఫానులతో పూర్తిగా ధ్వంసమైంది అని చెప్పారు.