Site icon NTV Telugu

Rahul Gandhi Fire On EC: దేశంలో ఎన్నికల వ్యవస్థ చచ్చిపోయింది..

Congress

Congress

Rahul Gandhi Fire On EC: దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఇవాళ జరుగుతున్న కాంగ్రెస్ న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను రాజును కాదు, రాజా కావాలని కోరుకోను.. రాజు కాన్సెప్ట్ కు నేను వ్యతిరేకం అన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రారంభించింది న్యాయవాదులే.. స్వాతంత్ర్య ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర కీలకం.. న్యాయవాదులు కాంగ్రెస్ కు వెన్నుముక గా ఉన్నారు.. మీరు చేసిన త్యాగాలను ఇపుడు విధ్వంసం చేశారు.. ఎన్నికల విధానాన్ని పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తున్నాయి.. బీజేపీ వరుస విజయాల వెనుక చీటింగ్ జరుగుతోంది.. ఇపుడు మన వద్ద ఆధారాలు ఉన్నాయి.. మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మేం గెలిచాం.. అసెంబ్లీలో మేం ఓడాం.. ఎన్నికల కమిషన్ కాపీలు స్కాన్ ప్రొటెక్ట్ తో రూపొందించారు.. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు.

Read Also: Anasuya : చెప్పు తెగుద్ది.. అంటూ బోల్డ్ కామెంట్లపై అనసూయ స్ట్రాంగ్ రియాక్షన్

ఇక, భారత్ లో ఎన్నికల కమిషన్ నిజంగా చచ్చిపోయిందని రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో పీఎం ఇన్ని సీట్లు గెలవలేరు.. మా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. కాబట్టే ఇపుడు మాట్లాడుతున్నాం.. ఎలా పోరాడాలో మాకు తెలుసు.. రాజకీయ నాయకులుగా మా పోరాటం చేస్తున్నాం.. న్యాయవాదులు కోర్టుల్లో పోరాడాలని సూచించారు. పీఎం ఆఫీస్ రఫెల్ బీ విషయంలో ఇచ్చిన డాక్యుమెంట్ స్పష్టంగా ఉంది.. ఏ దేశంలో ఇలా జరగదు.. నాపై కేసులు పెట్టారు, 30 కేసుల్లో పోరాడుతున్నాను.. రైతుల కోసం పోరాడితే.. నన్ను బెదిరించారు అని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎవరికి భయపడదు.. దేశం మా రక్తం.. రాజ్యాంగంపై అన్ని రకాలుగా దాడి చేస్తున్నారు.. రాజ్యాంగం పరిధిలోకి దేశంలోని అన్ని వర్గాలు వస్తాయి.. చరిత్రపై, చట్టాలపై, రాజ్యాంగంపై దాడి చేయడం దారుణమన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.

Read Also: Rahul Gandhi: 15 సీట్లతో మోడీ ప్రధాని అయ్యారు..

అయితే, నా కుటుంబం దేశం కోసం ప్రాణ త్యాగం చేసింది.. నేను ఎవరికి భయపడను అని రాహుల్ గాంధీ తెల్చి చెప్పారు. అగ్గికి భయపడి పోరాటం ఆపలేను.. ఎన్నటికైనా కాలి పోవాల్సిందే.. కాంగ్రెస్ శాంతి యుతంగా పోరాడుతుంది.. రాజకీయంగా మేం ఎలాగైనా పోరాడుతామన్నారు. కోర్టుల్లో న్యాయం కోసం పోరాడాల్సింది న్యాయవాదులు.. దేశంలో ఇపుడు లీగల్ సర్వీస్ అవసరం పడుతుంది.. దేశంలో ఎందరో కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయవాదుల అవసరం ఉంది.. లీగల్ ఎయిడ్ అందరికీ అందించాలని పేర్కొన్నారు.

Exit mobile version