Site icon NTV Telugu

మనోభావాలు దెబ్బతింటే, ఇంకేదైనా చదవండి:ఢిల్లీ హైకోర్టు

కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ కొత్త పుస్తకంపై నిషేధం కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. మనోభావాలను దెబ్బతీస్తే, ప్రజలు ఇంకేదైనా చదవాలని పేర్కొంది. కోర్టు పిటిషనర్‌తో, “ప్రజలను కొనుగోలు చేయవద్దని లేదా చదవవద్దని మీరు ఎందుకు అడగరు? పుస్తకం తప్పుగా రచించబడిందని దానిని చదవవద్దని అందరికీ చెప్పండి. మనోభావాలు దెబ్బతింటుంటే, వారు ఇంకేదైనా చదువుతారని కోర్టు పేర్కొంది. కాగా, ఈ పుస్తకం మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, దీనిపై నిషేధం విధించాలని, వాక్, భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తుందన్నారు. ఆర్టికల్‌ 19ప్రకారం ఇది సరైనదేనని పిటిషనర్‌ కోర్టు తెలిపారు.

దీనిపై స్పందించిన కోర్టు ఈ విషయం పుస్తకంలోని సారాంశానికి సంబంధించినది మాత్రమేనని, మొత్తం పుస్తకం కాదని దానిని మా ముందుకు తీసుకురాలేదని, మీరు పబ్లిషర్ లైసెన్స్‌ను రద్దు చేయాలనుకుంటే అది వేరే విషయమని కోర్టు పిటిషనర్‌కు తెలిపింది. కాగా ఖుర్షీద్ తన పుస్తకం ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్’లో హిందుత్వానికి సంబంధించి ఐసిస్, బోకో హరామ్ వంటి ఉగ్రవాద గ్రూపుల జిహాదీ ఇస్లాంతో పోల్చడంతో ఈ వివాదం తలెత్తింది.

Exit mobile version