Site icon NTV Telugu

Nitin Gadkari: వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఫాస్ట్‌ట్యాగ్‌పై ప్రత్యేక ఆఫర్

Fastag

Fastag

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. అవాంతరాలు లేని ప్రయాణం కోసం కేంద్రం సరికొత్త ఫాస్ట్‌ట్యాగ్‌‌ పాస్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ.3,000తో 200 ట్రిప్పులు తిరిగే అవకాశం లభించనుంది. ఈ కొత్త వార్షిక పాస్ ఆగస్టు 15, 2025 నుంచి అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని  ఎక్స్ ట్విట్టర్ ద్వారా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తెలియజేశారు. కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌తో వాహనదారులకు కష్టాలు తీరనున్నాయి. ప్రత్యేకంగా ఈ పాస్ వాణిజ్యేతర ప్రైవేటు వాహనాల కోసం ఉద్దేశించబడింది. కార్లు, జీపులు, వ్యాన్లకు ఈ పాస్ ప్రయోజనకరంగా ఉండనుంది. యాక్టివేషన్ తేదీ నుంచి సంవత్సరంలో లేదంటే మొత్తానికి 200 ట్రిప్పులు జాతీయ రహదారిపై తిరగవచ్చు.

ఇది కూడా చదవండి: Mega 157 : అనిల్ రావిపూడి సినిమాలో డ్రిల్ మాస్టర్ గా మెగాస్టార్

ఈ వార్షిక పాస్ దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులపై పని చేయనుంది. ఇందుకోసం ప్రత్యేక లింక్ త్వరలో రాజ్‌మార్గ యాత్ర యాప్‌లో అందుబాటులోకి రానుంది. అలాగే NHAI, MoRTH అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులోకి వస్తుంది. దీని ద్వారా 60 కి.మీ పరిధిలో ఉన్న టోల్‌ప్లాజాల నుంచి కష్టాల తగ్గనున్నాయి. ఈ పాస్ ద్వారా సరసమైన లావాదేవీ ద్వారా టోల్ చెల్లింపు జరగనుంది. అంతేకాకుండా వేచి ఉండే సమయాలు కూడా తగ్గనున్నాయి. వేగవంతమైన ప్రయాణాల కోసమే ఈ యాప్ తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది.

ఇది కూడా చదవండి: Iran-Israel: గురి చూసి ఇజ్రాయెల్ దాడి.. ఇరాన్ అణు పితామహుడు ఫక్రిజాదే మృతి.. గుర్తుచేసుకుంటున్న నిపుణులు!

 

Exit mobile version