Death Penalty: ఉరితీసే విధానంపై కేంద్రం కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టుకు ఈ రోజు తెలిపింది. మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం ఉరితీసే విధానం అమలులో ఉంది. అయితే దీన్ని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయిన కేంద్రం తరుపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వెల్లడించారు.
Read Also: DK Shivakumar: కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌కు తప్పిన ప్రమాదం. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..
ఇండియాలో మరణశిక్ష పడిన ఖైదీలకు ‘ఉరితీసే’ విధానం ద్వారానే శిక్షను అమలు చేస్తున్నారు. అయితే ఈ పద్ధతి సరైనదేనా..? ఇతర ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయా..? అనే అంశాలను పరిశీలనకు కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సలహా ఇచ్చింది. కాగా.. ఈ సలహాను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్ లో సభ్యులను ఎంపిక చేసేందుకు కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ప్రస్తుతం కేంద్రం దీనిపై చర్చిస్తోంది. దీనిపై స్పందించేందుకు మరింత సమయం కావాలి అని అటార్నీ జనరల్ తెలిపారు. ఇందుకు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారు. సీజైఐతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తదుపరి విచారణ తేదీని వేసవి సెలవుల తర్వాత ప్రకటిస్తామని తెలిపింది.
మరణశిక్ష అమలు చేసే పద్ధతిలో రాజ్యాంగబద్ధతనను సవాల్ చేస్తూ న్యాయవాది రిషి మల్హోత్రా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అమెరికా వంటి దేశాల్లో ఇంజెక్షన్ ద్వారా మరణిశిక్షను అమలు చేస్తున్నారు. దీంతో పోలిస్తే ఉరితీయడం అత్యంత క్రూరమైన, దారుణమైన విధానం అని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై ఈ ఏడాది మార్చిలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఉరిశిక్ష అమలుకు మానవీయ పద్ధతుల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయనే అంశాన్ని పరిశీలించాలని కేంద్రానికి సూచింది. దీనిపై కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది.
