Site icon NTV Telugu

Vulgar Dancing In School: చదువుకునే స్కూల్లో బార్‌ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకర నృత్యాలు..

Dance

Dance

Vulgar Dancing In School: చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే పవిత్రమైన పాఠశాలను కొంతమంది అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మార్చుకున్నారు. స్కూల్ లోనే మద్యం తాగుతూ, బార్‌ డ్యాన్సర్లతో కలిసి అసభ్యకర నృత్యాలతో సంబరాలు చేసుకున్నారు. బిహార్‌ రాష్ట్రంలోని సహర్సా జిల్లా జలాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Read Also: Labanon: ఓ వైపు ఐరాసలో నెతన్యాహు ప్రసంగం.. ఇంకోవైపు లెబనాన్‌పై దాడులు

కాగా, పెళ్లి వేడుకల నేపథ్యంలో కొంతమంది వ్యక్తులు బ్యాండు, నలుగురు బార్‌ డ్యాన్సర్లను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు తీసుకొచ్చి తాగి డ్యాన్సులు చేయడంతో స్థానికులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్ లో ఇలాంటి వేడుకలకు విద్యాశాఖ ఎలా పర్మిషన్ ఇచ్చిందని ప్రశ్నించారు. పెళ్లి బరాత్‌లో భాగంగా కొందరు స్కూల్ లో బస చేసి వినోదం కోసం ఇలా చేసినట్లు అధికారులు చెప్పుకొచ్చారు. మరోవైపు, ఈ అంశంపై స్థానిక పోలీస్‌ స్టేషన్ ఇన్‌ఛార్జి మమతా కుమారి మాట్లాడుతూ.. ఇలాంటి ఏ కార్యక్రమానికీ పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదన్నారు. ఈ వైరల్‌ వీడియో తమ దృష్టికి వచ్చింది.. దీనిపై విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

Exit mobile version