NTV Telugu Site icon

MS Dhoni: విమానంలో ధోనికి చాక్లెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టెస్.. వైరల్ అవుతున్న వీడియో..!

Dhoni

Dhoni

MS Dhoni: టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎక్కువే ఉన్నారు. అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి గుంపులు గుంపులుగా వస్తుంటారు జనాలు. ధోని అంటే అంత పిచ్చి జనాలకు. అతను క్రికెట్ లో ఆడిన షాట్స్ గానీ, అతను సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో ఎంత కూల్ గా ఉన్నారో మనందరికి తెలుసు. అయితే 5 ఐపీఎల్ ట్రోపీలు అందించి పెట్టిన ధోని.. ఈసారి ఐపీఎల్ ముగియగానే ముంబైలో మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ధోని ఐపీఎల్ ఆడుతుండగానే మోకాలికి గాయమైంది. అందులో భాగంగా సర్జరీ చేయించుకున్నాడు.

Read Also: Crime News: కదులుతున్న రైలులో మైనర్‌ బాలికను వేధించిన నిందితుడు అరెస్ట్

ఇటీవల ధోనీ ముంబై నుంచి రాంచీకి విమానంలో వెళ్తున్న సమయంలో ఎయిర్ హోస్టెస్ ధోనికి చాక్లెట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఎయిర్ హోస్టెస్ ఒక ట్రెలో చాక్లె్ట్ తీసుకొని ధోని వద్దకు రాగానే.. అప్పుడు ధోని తన వద్ద ఉన్న ట్యాబ్ లో క్యాండీక్రష్ ఆడుతున్నాడు. ఎయిర్ హోస్టెస్ నితికా ట్రెలో నుంచి చాక్లెట్లు ఇవ్వగా.. ధోని మాత్రం అందులోనుంచి ఒక్కటి మాత్రమే తీసుకున్నాడు. వెంటనే ఎయిర్ హోస్టెస్ స్పందిస్తూ.. సార్.. ఈ చాక్లెట్స్ అన్నీ మీకే తీసుకోండి అని అనడంతో.. నోనో వద్దు ఒక్కటి చాలు అని నవ్వుతూ సైగ చేస్తాడు. అయితే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: Deputy CM Narayanaswamy: పవన్ రెచ్చగొడుతున్నావ్.. నీ చుట్టూ ఉన్నవాళ్లందరు క్రిమినల్సే..

మరోవైపు ధోని క్యాండీక్రష్ ఆడుతున్న వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒకరైతే.. ధోనీ సార్.. క్యాండీక్రష్ ఏ లెవల్ ఆడుతున్నారు అంటూ ప్రశ్నించాడు. మరికొందరు నెటిజన్లు.. ధోనీ దెబ్బకు క్యాండీక్రష్ డౌన్‌లోడ్స్ అమాంతం పెరిగిపోవటం ఖాయం అంటూ ట్వీట్లు చేశారు. వీడియో షేర్ చేసిన కొద్దిగంటల్లోనే 2లక్షల మందికిపైగా నెటిజన్లు వీక్షించడం గమనార్హం.