Site icon NTV Telugu

Shashi Tharoor: రాహుల్ గాంధీతో విభేదిస్తున్న కాంగ్రెస్ ఎంపీలు.. ముందున్న శశిథరూర్..

Rahul Gandhi

Rahul Gandhi

Shashi Tharoor: భారతదేశంపై 25 శాతం సుంకాలను విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఇదే కాకుండా భారత ఆర్థిక వ్యవస్థను ‘‘చనిపోయిన ఆర్థిక వ్యవస్థ’’గా అభివర్ణించాడు. అయితే, ట్రంప్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ సమర్థించాడు. భారత ఆర్థిక వ్యవస్థ ‘‘డెడ్ ఎకానమీ’’ అని రాహుల్ గాంధీ చెప్పడంపై పలువురు కాంగ్రెస్ ఎంపీలు విభేదిస్తున్నారు. రాహుల్ వ్యాఖ్యలు చేసిన ఒక రోజు తర్వాత కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందిస్తూ.. ‘‘ట్రంప్ వ్యాఖ్యలు నిజం కాదని మనందరికి తెలుసు’’ అని ట్రంప్ వ్యాఖ్యల గురించి అడిగినప్పుడు ఆయన చెప్పారు.

ట్రంప్ గురువారం భారతదేశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు.భారతదేశం రష్యాతో ఏమి చేస్తుందో నాకు పట్టింపు లేదు. వారు తమ చనిపోయిన ఆర్థిక వ్యవస్థలను కలిసి తగ్గించుకోవచ్చు, నాకు ముఖ్యం. మేము భారతదేశంతో చాలా తక్కువ వ్యాపారం చేసాము, వారి సుంకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ప్రపంచంలోనే అత్యధికం. అదేవిధంగా, రష్యా మరియు USA కలిసి దాదాపు ఎటువంటి వ్యాపారం చేయవు. దానిని అలాగే ఉంచుదాం,” అని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

Read Also: CM Chandrababu: అన్నదాతలకు సీఎం గుడ్‌న్యూస్.. రేపటి నుంచే ఒక్కో రైతుకు రూ. 20 వేలు..

ఈ వ్యాఖ్యలపై తాను ఏకీభవిస్తున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. ‘‘ట్రంప్ చెప్పింది అంతా నిజమే. ప్రధాని, ఆర్థిక మంత్రికి తప్పా ఈ విషయం అందరికి తెలుసు. ఆయన నిజం చెప్పినందుకు ఆనందంగా ఉంది’’ అని అన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం శుక్రవారం మాట్లాడుతూ.. ట్రంప్ సంప్రదాయేతర రాజకీయ నాయకుడు అని అన్నారు. భారత్, అమెరికా ప్రజల మధ్య మంచి సంబంధాల ఉన్నాయి. దీర్ఘకాలంలో ఈ సంబంధాలు దెబ్బతినవు అని ఆయన అన్నారు. రాజ్యసభ ఎంపీ రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. మన ఆర్థిక వ్యవస్థ ఏ మాత్రం బలహీనంగా లేదని, ఎవరైనా మనల్ని ఆర్థికంగా అంతం చేయాలనుకుంటే అది అపార్థమే అవుతుందని, ట్రంప్ భ్రమల్లో జీవిస్తున్నారని అన్నారు.

Exit mobile version