Thackeray Memorial purified: మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం కూలిపోయింది.. అప్పటి సీఎం ఉద్ధవ్ థాక్రేకి నమ్మకస్తుండి.. తన కేబినెట్‌లో మంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ షిండే.. బయటకు వెళ్లిపోవడమే కాదు.. చాలా మంది ఎమ్మెల్యేలను సైతం తన వెంట తీసుకెళ్లాడు.. దీంతో ఉద్ధవ్ సర్కార్ కూలిపోయింది.. ఆ తర్వాత బీజేపీతో చేతులు కలిపి శివసేన రెబల్ నేత ఏక్‌నాథ్ షిండే.. ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.. దీంతో, షిండేను వెనక ఉండి నడిపించింది మొత్తం భారతీయ జనతా పార్టీయేనని స్పష్టమైపోయింది.. ఇక, అప్పటి నుంచి శివసేనలో వర్గపోరు నడుస్తూనే ఉంది.. పార్టీ పేరు, సింబల్ విషయంలోనూ న్యాయపోరాటం చేస్తున్నాయి రెండు వర్గాలు.. ఇప్పుడు శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే వర్ధంతి సందర్భంగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
Read Also: Botsa Satyanarayana: తథాస్తు.. చంద్రబాబు కోరిక తప్పకుండా నెరవేరుతుంది
ఇక, అసలు విషయానికి వస్తే.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే పదో వర్ధంతి సందర్భంగా.. శివసేన రెబల్ నేత, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే.. బుధవారం రోజు బాలాసాహెబ్ థాక్రే సమాధిని సందర్శించారు.. నివాళులర్పించి అంజలి ఘటించారు.. అయితే, ఆ తర్వాత అక్కడకు చేరుకున్న శివసేనలోని ఉద్ధవ్ థాక్రే వర్గం నేతలు, కార్యకర్తలు.. బాల్ థాక్రే సమాధిని శుద్ధి చేశారు. బాల్ ఠాక్రే మెమోరియల్ ప్రాంగణం మొత్తం.. ఆయన సమాధిని నీటితో కటిగేశారు.. గోమూత్రం చల్లి శుద్ధి చేశారు… ఇక, ఏదైనా కాస్త వెరైటీగా కనిపిస్తే.. రెచ్చిపోయే నెటిజన్లకు.. దీనికి సంబంధించిన వీడియో దొరికింది.. దీంతో.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఈ ఘటనపై సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గం మండిపడుతోంది.. బాలాసాహెబ్ థాక్రే ఎవరో ఒక వ్యక్తికి..? లేదా ఒక పార్టీకి చెందినవ్యక్తి కాదని శివసేన రెబల్ వర్గం నేత దీపక్ కేసర్కర్ పేర్కొన్నారు.