Site icon NTV Telugu

Mumbai: ముంబై మున్సిపల్ ఎన్నికల కోసం చేతులు కలిపిన థాక్రే బ్రదర్స్.. హస్తం పార్టీ అసంతృప్తి!

Thackeray Brothers

Thackeray Brothers

ఇటీవల జరిగిన మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో శివసేన (యూబీటీ) ఘోరంగా దెబ్బతింది. దీంతో ఆ పార్టీ అప్రమత్తం అయింది. జనవరిలో జరిగే ముంబై మున్సిపల్ ఎన్నికల్లో అయినా తమ సత్తా చాటుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో థాక్రే బ్రదర్స్ ఒక్కటయ్యారు. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నట్లు ఉద్ధవ్ థాక్రే-రాజ్ థాక్రే సంయుక్త మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటించారు. మరాఠీ గుర్తింపు కోసం కలిసి పోటీ చేస్తున్నామని.. ఆర్థిక రాజధాని ముఖ చిత్రాన్ని మారుస్తామని వెల్లడించారు.

జనవరి 15న జరిగే ఎన్నికల్లో శివసేన (యూబీటీ)-ఎంఎన్‌ఎస్ కూటమి కలిసి పోటీ చేస్తాయని రాజ్ థాక్రే తెలిపారు. ముంబైకి మరాఠీ మేయర్ రాబోతున్నట్లు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో ఆ మేయర్ వస్తారని చెప్పుకొచ్చారు. ఉద్ధవ్ థాక్రే కూడా ధీమా వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: Nitin Gadkari: 2 రోజులు ఢిల్లీలో ఉండలేకపోయా.. కాలుష్యంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

ఉద్ధవ్ పార్టీ సింహభాగం అంటే దాదాపు 145-150 సీట్లు.. రాజ్ థాకరే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ 65-70 సీట్లలో పోటీ చేయవచ్చని వర్గాలు సూచిస్తున్నాయి. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ వర్గం ఈ కూటమిలో భాగం అయి మిగిలిన 10-12 సీట్లలో పోటీ చేస్తుందని భావిస్తున్నారు.

అయితే థాక్రే బ్రదర్స్‌తో కలిసి పోటీ చేసే ఉద్దేశం కాంగ్రెస్‌కు లేనట్లుగా కనిపిస్తోంది. రాజ్ థాక్రేతో కలిసి పని చేయలేమని హస్తం పార్టీ సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో కాంగ్రెస్ సింగిల్‌‌గానే బరిలోకి దిగొచ్చని సమాచారం. ఇదే విషయంపై ఇప్పటికే సంజయ్ రౌత్.. రాహుల్ గాంధీ మాట్లాడారు. కానీ ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Silver Rates: వామ్మో.. సిల్వర్‌‌కు ఏమైంది?.. రికార్డ్ స్థాయిలో పెరిగిన వెండి ధర

Exit mobile version