NTV Telugu Site icon

Jammu Kashmir: కథువాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం..

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ కథువాలో భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది మరణించారు. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ)కి సమీపంలో హీరానగర్ సెక్టార్‌లోని కథువాలోని సైదా గ్రామంలో ఇంటిపై ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రదాడి గురించి అప్రమత్తమైన భద్రతా బలగాలు ఆ గ్రామానికి చేరుకుని ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టాయి. కథువా ఎస్పీ అనయత్ అలీ చౌదరి ఎన్‌కౌంటర్ స్థలంలోనే ఉన్నారు. గ్రామస్తులు ముగ్గురు సాయుధులను గుర్తించిన తర్వాత అధికారులను అప్రమత్తం చేశారు. ముష్కరులు సమీపంలోని అడవుల్లోకి పారిపోయేందుకు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. పోలీసులు, బీఎస్ఎఫ్ అనుమానిత వ్యక్తుల కోసం జాయింట్ ఆపరేషన్ ప్రారంభించింది.

Read Also: Delhi: విద్యుత్ సంక్షోభంపై కేంద్రానికి మంత్రి అతిషి లేఖ

రెండు రోజుల వ్యవధిలో జమ్మూలో రెండు ఉగ్రదాడులు జరిగాయి. ఆదివారం రియాసీ జిల్లాలో బస్సులో ప్రయాణిస్తున్న యాత్రికులుపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 9 మంది మరణించారు. ఈ దాడి వెనక పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు భద్రతా అధికారులు అనుమానిస్తున్నారు. రెండు రోజులుగా ఉగ్రవాదుల్ని గుర్తించేందుకు భద్రతా బలగాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి. రాన్సో-పోనీ-ట్రియాత్ బెల్ట్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రతను మోహరించారు. పారిపోతున్న ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు పోలీస్, ఆర్మీ, సీఆర్పీఎఫ్‌కి చెందిన 11 టీములు జాయింట్ ఆపరేషన్ ప్రారంభించాయి.

Show comments