Terrorist Harwinder Rinda dies in Pakistan: మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హర్విందర్ రిండా మరణించినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ లో ఉంటున్న ఈ ఖలిస్తానీ ఉగ్రవాది గ్యాంగ్ వార్ లో హత్యకు గురైనట్లు పంజాబ్ పోలీసు వర్గాలు తెలిపాయి. గ్యాంగ్‌స్టర్ గ్రూప్ డేవిందర్ భంబిహా గ్రూప్ హర్విందర్ రిండాను హత్య చేసినట్లు వెల్లడించారు. రిండాపై మహారాష్ట్ర, చండీగఢ్, హర్యానా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో అనేక కేసులు ఉన్నాయి. మే నెలలో పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌పై రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్ (ఆర్‌పిజి) దాడిలో కీలక నిందితుడిగా ఉన్నా హర్విందర్ రిండా. దీంతో పాటు లూథియానా కోర్టు పేలుడు కేసులో కూడా రిండా ప్రధాన సూత్రధారి.
Read Also: Bajrang Dal: శ్రద్ధావాకర్ హత్య “లవ్ జీహాద్”కు ఉదాహరణ.. అఫ్తాబ్ దిష్టిబొమ్మ దహనం
పంజాబీ సింగర్ సిద్దూ మూసేవాలా హత్యలో కూడా రిండా పేరు తెరపైకి వచ్చింది. పలు ఉగ్రవాద కేసుల్లో రిండా నిందితుడిగా ఉన్నాడు. నిషేధిత ఖలిస్తానీ సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సభ్యుడిగా హర్విందర్ రిండా ఉన్నాడు. ఇదిలా ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా హర్విందర్ సింగ్ రిండా 15 రోజల పాటు పాకిస్తాన్ లాహెర్ ఆస్పత్రిలో చికిత్స పొందినట్లు, అక్కడే మరణించినట్లు మరో వాదన ఉంది. రిండాపై ఎన్ఐఏ రూ. 10 లక్షల నగదు బహుమతి ప్రకటించింది.
గ్యాంగ్‌స్టర్లు, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలతో హర్విందర్ సింగ్ రిండాకు సంబంధాలు ఉన్నాయి. జాతీయ భద్రతకు రిండా ముప్పుగా ఉన్నాడని కేంద్రం భావిస్తోంది. డ్రగ్స్, అక్రమ ఆయుధాల సరిహద్దుల గుండా పాకిస్తాన్ నుంచి భారత్ లోకి తీసుకురావడంలో రిండాది కీలక పాత్ర. మే నెలలో హర్యానాలో వాహనం నుంచి ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో రిండాపై ఛార్జిషీట్ దాఖలు అయింది.