NTV Telugu Site icon

FIRE ACCIDENT : యూపీలో దారుణం.. గుడిసెకు మంటలు.. ఐదుగురు సజీవదహనం..

Fire Accident

Fire Accident

ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కాన్ఫూర్ దేహత్ ప్రాంతంలోని ఓ గుడిసేలో రాత్రి అగ్రిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం రూరా పోలీస్ స్టేషన్ పరిధిలోని హర్మౌ బంజారాదేరా అనే గ్రామంలో జరిగింది. బంజారదేరా విలేజ్ లో సతీష్ కుమార్ తన భార్య కాజల్, ముగ్గురు పిల్లలతో కలిసి ఓ గుడిసెలో నివసిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే వీరంతా రాత్రి గుడిసెలో పడుకున్నారు. అయితే ఏమయిందో తెలియదు కానీ ఆ గుడిసెకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అందులో ఉన్న ఐదుగురు సజీవదహనం అయ్యారు. దీంతో అప్రమత్తమైన స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు.

Also Read : MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపే పోలింగ్

గుడిసెకు మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన కుటుంబసభ్యులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. దీంతో సంఘటన స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. అయినా ఆ కుటుంబాన్ని కాపాడలేకపోయారు. ఈ అగ్ని ప్రమాదంలో సతీష్ తల్లికి కూడా గాయాలు అయ్యాయి. అయితే ఆమెను చికిత్ప కోసం హస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న జిల్లా మేజిస్ట్రేట్, ఎస్పీ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుకునేందుకు ఫోరెన్సిక్ టీమ్, డాగ్ స్క్వాడ్ లను రంగంలోకి దించారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా పై కప్పుకు మంటలు అంటుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్థులు తెలిపారు.
సతీష్ అతడి కుటుంబం మంటల్లో సజీవదహనమైనట్లు మాకు సమాచారం అందింది.

Also Read : Gold Smugglers : ముంబైలో భారీగా బంగారం పట్టివేత