NTV Telugu Site icon

Telangana Voice: గెలిచిన తెలంగాణ వాదన. వెనక్కి తగ్గిన కేంద్ర ప్రభుత్వం

Telangana Voice

Telangana Voice

Telangana Voice: మన దేశంలోని థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలు తప్పనిసరిగా 10 శాతం విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిందేనంటూ గతంలో ఒకటికి రెండు సార్లు హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తాజాగా వెనక్కి తగ్గింది. దీంతో ఇది తెలంగాణ రాష్ట్రానికి ఊరట కలిగించే అంశమని నిపుణులు చెబుతున్నారు. మాకు సింగరేణి ఉండగా ఇతర దేశాల నుంచి బొగ్గును కొనే ప్రసక్తే లేదని తెలంగాణ మొదటి నుంచీ వాదిస్తూనే ఉండటం గమనించాల్సి విషయం. కేంద్ర ప్రభుత్వం తన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవటంతో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ వాదన గెలిచినట్లయింది.

స్పైస్‌జెట్‌ ‘ట్యాక్సీ’

స్పైస్‌జెట్‌ ఎయిర్‌లైన్స్‌.. దుబాయ్‌ సహా 28 ప్రధాన విమానాశ్రయాల్లో ట్యాక్సీ సర్వీసులను ప్రారంభించింది. ఫ్లైట్‌ టికెట్లను బుక్‌ చేసుకునేటప్పుడు ట్యాక్సీ సర్వీసులకు సంబంధించిన ఎస్‌ఎంఎస్‌ వస్తుంది. ఆ లింక్‌ను ఓపెన్‌ చేసి పికప్‌ లొకేషన్‌, పికప్‌ టైమ్‌ తదితర వివరాలివ్వాలి. దీనివల్ల ప్రయాణికులు పనిగట్టుకొని క్యాబ్ బుక్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదని స్పైస్‌జెట్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ తెలిపారు.

Reserve Bank: రిజర్వ్‌ బ్యాంక్‌కి ‘రుణ’పడి ఉంటారు. కొత్త గైడ్‌లైన్స్‌.. నిజంగా గుడ్‌ న్యూస్‌.

టాప్‌లో బీఓఎం

ఈ ఆర్థిక సంవత్సరంలోని తొలి త్రైమాసికంలో లోన్లు మరియు డిపాజిట్‌ గ్రోత్‌ పర్సంటేజ్‌ల విషయంలో బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర() టాప్‌లో నిలిచింది. అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల కన్నా బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర అగ్రస్థానాన్ని ఆక్రమించటం విశేషం. జూన్‌ చివరి నాటికి ఈ బ్యాంకు గ్రాస్‌ అడ్వాన్స్‌లు 27 శాతానికి పైగా పెరిగి రూ.1,40,561 కోట్లకు చేరాయి.

10 వేలకే 5జీ ఫోన్‌

కేవలం రూ.10 వేలకే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది మార్కెట్‌లోకి తెస్తామని క్వాల్కం ఇండియా చీఫ్‌ రాజెన్‌ వగాడియా తెలిపారు. ఇండియన్‌ చిప్‌ మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్న ఈ సంస్థ వివిధ సెల్‌ఫోన్‌ పరికరాల తయారీదారులు మరియు టెలికం కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాజెన్‌ వగాడియా ఓ మీడియా గ్రూప్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

మాకు మాత్రమే!

ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్స్‌లో బహుశా తాము మాత్రమే డే-1 నుంచి లాభాల్లో ఉన్నామేమోనని క్యూమిన్‌ ప్రతినిధి జహంగీర్‌ ప్రెస్‌ అన్నారు. తాజ్‌ హోటల్స్‌ను నిర్వహిస్తున్న ఇండియన్‌ హోటల్స్‌ సంస్థ రెండేళ్ల కిందట ఈ క్యూమిన్‌ అనే ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ని ప్రారంభించింది. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవటం వల్లే నష్టాలు లేకుండా కొనసాగుతున్నామని జహంగీర్‌ ప్రెస్‌ పేర్కొన్నారు.

బంగ్లాకి ‘మలబార్‌’

రిటైల్‌ జ్యూలరీ సంస్థ మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ మన పక్క దేశమైన బంగ్లాదేశ్‌లో రూ.200 కోట్లతో ఆభరణాల తయారీ యూనిట్‌ని ఏర్పాటు చేస్తోంది. చేతితో డిజైన్‌ చేసిన ఆభరణాలకు ఆ దేశంలో గిరాకీ పెరుగుతుండటంతో మార్కెట్‌ను సొంతం చేసుకునేందుకు పెట్టుబడి పెడుతోంది. మరో వైపు.. పశ్చిమ బెంగాల్‌లోని హ్యాండ్‌క్రాఫ్టెడ్‌ జ్యూలరీ మ్యానిఫ్యాక్చరింగ్‌ కెపాసిటీని కూడా రెట్టింపు చేస్తోంది.