Governor Tamilisai: ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఓ ప్రయాణికుడికి చికిత్స అందించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
Rtc Duty Timings in Telangana: కొత్త రూల్.. ఆ టైమ్ దాటితే అవసరం లేదంటూ వార్నింగ్
దీంతో విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అనౌన్స్ చేయడంతో… విషయం తెలిసిన డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ వెంటనే స్పందించి ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స అందించి, భరోసా ఇచ్చి ఉపశమనం కలిగించారు.కోలుకున్న ప్రయాణికుడు గవర్నర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. అదేవిధంగా ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు అభినందనలు తెలిపారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలు… ఎంబీబీఎస్, ఎండీ, డీజీఓ లాంటి వైద్య విద్యా కోర్సులు చేసిన విషయం విదితమే.
Today I have onboarded with @DrTamilisaiGuv and she treated a patient who fell ill on Air on Delhi-Hyd bound flight. @IndiGo6E @TelanganaCMO @bandisanjay_bjp @BJP4India @TV9Telugu @V6News pic.twitter.com/WY6Q31Eptn
— Ravi Chander Naik Mudavath 🇮🇳 (@iammrcn) July 22, 2022