Site icon NTV Telugu

తెలంగాణ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

తెలంగాణ‌లో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. రాష్ట్రంలో గ‌డిచిన 24 గంట‌ల్లో 1,23,166 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, 645 మందికి పాజిటివ్‌గా తెలింది.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 6,42,436 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  ఇందులో 6,29,408 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,237 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంట‌ల్లో తెలంగాణ‌లో క‌రోనాతో 4 మంది మృతి చెందారు.  దీంతో రాష్ట్రంలో క‌రోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు మృతి చెందిన వారి సంఖ్య 3,791కి చేరింది.  తెలంగాణ‌లో కోలుకున్న వారి రేటు 97. 97%గా ఉంటే, మ‌ర‌ణాల రేటు 0.59 శాతంగా ఉంది. 

Read: ఆహాలో సమంత ‘సూపర్ డీలక్స్’

Exit mobile version