Site icon NTV Telugu

CM K.Chandrashekar Rao: అఖిలేష్ యాదవ్‌తో సీఎం కేసీఆర్ భేటీ.. జాతీయ రాజకీయాలపై కీలక చర్చ

Cm Kcr Meets Akhilesh Yadav

Cm Kcr Meets Akhilesh Yadav

CM K.Chandrashekar Rao: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెసేతర ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇవాళ ఢిల్లీలోని ఆయన అధికారిక నివాసంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌తో పాటు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ యాదవ్‌తో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారిరువురిని శాలువా కప్పి ఆహ్వానం పలికారు. జాతీయ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై వారు చర్చించినట్లు సమాచారం. దాదాపు రెండుగంటలకుపైగా భేటీ కొనసాగింది. దేశ రాజకీయాల్లో బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు, వాటిని ఎదుర్కొనేందుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే విషయంపై చర్చించినట్లు సమాచారం. ఇటీవలే ఢిల్లీ వెళ్లిన ఆయన ఇప్పటివరకు పలువురు జాతీయ స్థాయి ప్రతిపక్ష పార్టీల నేతలను కలుసుకొన్నారు. దేశ రాజకీయాలపై పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టారు.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకుంటోన్న పరిణామాలపై మాట్లాడారు. కాంగ్రెస తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు వరుసగా మూడు రోజుల పాటు విచారించడం, పశ్చిమ బెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీ, అర్పిత ఛటర్జీ నివాసాలపై దాడులు సాగించడం వంటి పరిణామాలు వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల ప్రారంభంలో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, ఎంకే స్టాలిన్, తేజస్వి యాదవ్, శరద్ పవార్‌లతో సహా అనేక మంది ప్రతిపక్ష నాయకులతో మాట్లాడారు. జాతీయ రాజకీయాల గురించి ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం అనేక సార్లు ఈ నాయకులను కలుసుకున్నారు.

Komatireddy Rajagopal Reddy: ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు.. కోమటి రాజగోపాల్‌రెడ్డి.. ఇటా? అటా..?

ఇటీవల బీజేపీపైనా, ప్రధాని మోదీపైనా తన మాటల తూటాలతో దాడిని మరింత పెంచారు. ఇటీవల ఆయన ప్రధాని మోదీని “దేశం ఎన్నడూ చూడని బలహీనమైన ప్రధాని” అని అన్నారు. దేశంలో “ప్రకటించని ఎమర్జెన్సీ” ఉందని ఆయన విమర్శల వర్షం గుప్పించారు. గత మూడు రోజులుగా దేశ రాజధానిలో ఉన్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఎంపీలతో పలు సమావేశాలు నిర్వహించి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రైతు సంఘాల ప్రతినిధులతోనూ ఆయన సమావేశం కానున్నారు.

 

Exit mobile version