Site icon NTV Telugu

Srilanka Crisis: శ్రీలంకలో డబ్బులు పంచుతున్న తెలంగాణ వ్యాపారవేత్త అరెస్ట్

Telangana Business Man

Telangana Business Man

గత కొన్ని నెలలుగా శ్రీలంకలో ఆర్ధిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. దీంతో అక్కడి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ వ్యాపారవేత్త శ్రీలంక ప్రజలకు డబ్బులు పంచుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రవీందర్ రెడ్డిని ఇటీవల శ్రీలంక క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్ (సీఐడీ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీలంక ప్రజలకు ఆయన రూ.5 లక్షలు పంచుతుండగా సీఐడీ అధికారులు ప్రశ్నించి వదిలేసినట్లు రవీందర్‌రెడ్డి స్వయంగా వెల్లడించాడు.

అయితే తాను ప్రతినెలా శ్రీలంక వెళ్తానని, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని ఆకలితో అలమటిస్తున్న ప్రజలకు డబ్బులు, ఆహారం, ఇతర వస్తువులు అందిస్తున్నట్లు వ్యాపారవేత్త రవీందర్‌రెడ్డి వివరించారు. నెలలో 9 నుంచి 21 రోజుల పాటు శ్రీలంకలోనే ఉండి ప్రజలకు సాయం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ఆయన పరిపాలనకు వ్యతిరేకంగా కొలంబోలో నిరసనలు చేపట్టగా తాను కూడా ఆందోళనల్లో పాల్గొని ప్రజలకు మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశంలో తాను భారత కరెన్సీని శ్రీలంక కరెన్సీలోకి మార్చి రూ.500, రూ.1000 నోట్లను పంచుతుండగా పోలీసులు తనను అరెస్ట్ చేశారని రవీందర్‌రెడ్డి చెప్పారు.

5G Spectrum: కేంద్రం కీలక నిర్ణయం.. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేబినెట్ ఆమోదం

Exit mobile version