Site icon NTV Telugu

NFSA: ఆహార భద్రతలో ఒడిశా నంబర్‌వన్.. తెలంగాణ స్థానం ఎంతో తెలుసా?

Food Security Act

Food Security Act

జాతీయ ఆహార భద్రతా చట్టం అమలు ఒడిశా దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రెండు,మూడు స్థానాల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ నిలవగా.. తెలంగాణకు 12వ స్థానం దక్కింది. జాతీయ ఆహార భద్రతాచట్టం అమలుపై కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్ రాష్ట్ర మంత్రులతో సమావేశమయ్యారు. ‘ఎన్ఎఫ్ఎస్‌ఏ ర్యాంకుల సూచీ-2022’ని ఆయన విడుదల చేశారు. జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ దుకాణాల ద్వారా పేదలకు బియ్యం, గోధుమలు, ఇతర నిత్యావసరాలు సరఫరా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్‌ఎఫ్ఎస్ఏ అమలు తీరును ఈ సూచీ లెక్కించింది. ప్రత్యే కేటగిరీ రాష్ట్రాల్లో త్రిపుర మొదటి స్థానంలో నిలవగా.. తర్వాతి స్థానాల్లో హిమాచల్ ప్రదేశ్, సిక్కిం ఉన్నాయి.

India Air Force: యుద్ధ విమానాన్ని నడిపిన తండ్రీకూతుళ్లు.. ఐఏఎఫ్ చరిత్రలో తొలిసారి!

ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌లకు మంత్రి పీయూష్‌ గోయల్‌ ట్విటర్‌ వేదికగా అభినందనలు తెలిపారు. ఒకే దేశం-ఒకే రేషన్‌ కార్డు’ లాంటి వ్యవస్థ ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు. లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ఈ పథకం ప్రయోజనాలు పొందొచ్చన్నారు. రానున్న కాలంలో ఇతర రాష్ట్రాలూ మరింత దృష్టి సారించి మెరుగైన ర్యాంకులు పొందుతాయని ఆయన అన్నారు.

Exit mobile version