Site icon NTV Telugu

Bihar Elections: ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్.. కాసేపట్లో ఉమ్మడి ప్రకటన

Indai Bloc

Indai Bloc

మొత్తానికి బీహార్‌ విపక్ష కూటమిలో చోటుచేసుకున్న సంక్షోభానికి తెర పడింది. కూటమి పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. అశోక్ గెహ్లాట్ జరిపిన దైత్యం విజయవంతం అయింది. దీంతో ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ అభ్యర్థిత్వాన్ని అన్ని పార్టీలు అంగీకరించాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఇండియా కూటమి పార్టీలు సంయుక్త ప్రెస్‌మీట్ నిర్వహించి ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నారు.

బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు వరకు ఇండియా కూటమి ఏకంగానే ఉంది. అయితే సీట్ల పంపకాల విషయంలో తేడా రావడంతో చివరి నిమిషంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా విడివిడిగా నామినేషన్లు వేశారు. దీంతో అధికారంలోకి వద్దామనుకున్న కూటమి ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు విపక్ష కూటమి బలహీనతను అధికార కూటమి క్యాష్ చేసుకుంటోంది. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. దీంతో కాంగ్రెస్ అప్రమత్తం అయింది. సీనియర్ నాయకుడు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను రంగంలోకి దింపింది. అంతే హుటాహుటినా అశోక్ గెహ్లాట్ పాట్నాలో వాలిపోయారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇంట్లో ఇండియా కూటమి పార్టీలతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ఏక కంఠంతో అంగీకారం తెలిపాయి. దీంతో కూటమిలో నెలకొన్న సంక్షోభం ఒక్కసారిగా పటాపంచలు అయింది.

ఇది కూడా చదవండి: PM Modi: ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ దూరం! కారణమిదే!

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇక ప్రధాని మోడీ అక్టోబర్ 24న ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: Delhi Encounter: ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం

Exit mobile version